Search blog.co.uk

రాంరళీయ షడ్వేదం!! మొదటి భాగం-5.

by ramrali @ 2007-10-18 - 12:07:54

రాంరళీయ షడ్వేదం!! మొదటి భాగం-5.
13.క్షేత్ర-క్షేత్రజ్ఞ విభాగ యోగం:- మనిషి చనిపోయాక ఈ పదమూడో రోజుకు ప్రాముఖ్యత వుంది. ఈ స్టేజిలో వున్న వానికి క్షేత్ర స్వరూప స్వభావాలూ-ఏ క్షేత్రంలో ఏ జీవి పెరుగుదల వుంటుందో,క్షేత్రజ్ఞుడి వివరం అవగతమౌతుంది.అందువల్ల, మరు జన్మ కెగబడేవాని కైతే,ఇక్కడ మరు జన్మలో తాను ఏ పుటక పుడతాడో లేక దేవునిలో ఐక్యమగునో తెలుసుకోగలుగుతాడు.14.గుణత్రయ విభాగ యోగం:- ఈ స్టేజి లో గుణ త్రయాలూ-సత్త్వ-రజస్-తమో గుణాలు ఏవిధంగా మనిషి పై ప్రభావం చూపుతాయో తెలియ చెప్పి-ఈ మూడూ ఆ త్రిమూర్తులేనని చెబుతాయి.ముగ్గురినీ సమానంగా ఆరాధించుట వల్ల,శరీరంలో సమతుల్యం దెబ్బ తినకుండా వుంటుంది.ప్రతి జీవిలోనూ ఈ మూడు గుణాలున్నా ఏదో ఒకటి ప్రకోపించి ,మనిషి ఆ గుణానికి చెందిన వాడౌతాడు.15.పురుషోత్తమ ప్రాప్తి యోగం:- ఈ స్టేజికొచ్చేసరికి మనిషి పురుషులలో(స్త్రీ కూడా)ఉత్తముడనబడతాడు. ఇటువంటి పురుషోత్తములు జనులకు ఆరాధ్య దైవాలవుతారు.16.దైవాసుర సంపద్విభాగ యోగం:- మనిషిలో నే దేవుడూ-దయ్యమూ వుంటాయి.వీరి మధ్య నిత్య సంఘర్షణ జరుగుతుంటుంది. దైవాంశ నెగ్గితే ఉత్తముడనిపించుకుంటాడు.దానవాంశ నెగ్గితే కృరుడనిపించుకుని రాక్షస వెధవ అనిపించుకుంటాడు.ఈ స్టేజిలో వ్యక్తులు జిహాదీలూ చెయ్యచ్చు లేక మంచిని పభోధించే వారిగానూ మార వచ్చు.ఈ పదహారు ఒకటి ప్లస్ ఆరు అంటే ఏడు. మళ్లీ మనిషి.అర్జునుడు. ఇటు కీర్తిని పొందేలా వ్యవహరించవచ్చు.లేక అపకీర్తిని పొందే విధంగా వ్యవహరించి పతనం కావచ్చు.ఇక్కడే పూర్తిగా దేవుని కి శరణాగతుడై మంచి మార్గము నిర్దేసించమనై కోరితే ఆయన మంచి పనులు జీవి చేత చేయిస్తాడు.17.శ్రద్ధాత్రయ విభాగ యోగం:- ఇక్కడే సాయిబాబా వారి సూక్తి వస్తుంది.శ్రద్ధా-సబూరీ! శ్రద్ధతో పట్టుదలతో కార్య నిర్వహణను సబూరీ(నమ్మిక) తో చేయాలి.వీటిని  సాత్విక - రాజసిక - తామసిక అని విభజించి చెప్పారు.ఈ శ్రధ్ధగా చేసిన పనిలోని ఫలితాలు మనం చూపిన శ్రద్ధా లక్షణాలని బట్టి వుంటాయి.ఇక ఆఖరిది 18 వ అధ్యాయం:-మోక్ష స్న్న్యాస యోగం:- ఇక చివరిది మోక్ష ప్రాప్తే! ఇన్ని మెట్లూ ఎక్కి మోక్షానికి అర్హత సంపాదించాలి.ఈ 18 పురాణాలూ వగైరాలన్నీ ఈ సంఖ్య పైనే నడుస్తాయి.అష్టాదశ యోగాలు సిద్ధింపచేసుకుని,మోక్షం పొందమని భగవద్గీత చెబుతుంది.  ఇలా ఈ పద్ధెనిమిది మార్గాల్లోనూ పయనించి దేవుని చేరవచ్చు. దేవుని దృఢభక్తితో నమ్మితే ,మధ్యలోనే షార్ట్ కట్ ద్వారా దేవుని చేరవచ్చు.దృఢభక్తికున్న గొప్పతనమది.మళ్లీ దేవుడున్నాడా?లేడు. కాని వున్నాడు. మనకి శాంతి సౌఖ్యాలను అందిస్తున్న వాడు ఆ దేవుడే! బతికినంత కాలం మనిషి కోరేదేమిటి? తిండీ-బట్టా-గూడూ తరవాత నిత్య ఆనందం,సుఖం శాంతి.అంతేగా?డబ్బులూ-మేడలూ మిద్దెలూ,విమాన ప్రయాణాలూ ఇటువంటి వన్నీ అవసరమా?లేదు గాక లేదు. అందుకే హైందవం సంతృప్తి అని చెబుతుంది.ఉన్న దానితో సరిపెట్టుకుని,పొరుగువానికి సాయం చెయ్యమంటుంది.దాన-ధర్మాలని చెప్పి,ఒకే చోటికి అధిక థనం చేరకుండా చూస్తుంది.ఇక దేవుని బాహ్యాన్ని మానవ రూపంలో కొలవటమంటే- ఆయనకు అన్ని అలంకరణలూ చేసి ,అన్నీ ఆయనదగ్గరే ఉంటాయి అని చూపడ మెందుకంటే- ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక మంగళ స్వరూపాన్ని చూడాలనుకుంటాడు మానవుడు.అంతే గాని శవాలని చూడా లనుకోడు. ఉదయాన్నే లేచి చెట్లూ పుట్టలూ చూసినా ప్రకృతి రామణీయకతను గాంచినా పులకింత కలుగుతుంది.కాని ఒక్కోరోజు అలా ప్రకృతిని తిలకిస్తుంటే,ఏదో అనుకోని ఘోరం కళ్ళ బడచ్చు.ఓ పిట్టని ఎవడో వేటాడుతాడు.అప్పుడా రోజంతా మానసిక అశాంతికి గురి అవచ్చు. అందుకే లేవగానే దేవుని ఒక దివ్య మంగళ రూపంలో చూడ్డానికే ఈ విగ్రహారాథనలొచ్చాయి.ఆ కిటుకు హైందవానికే తెలుసు. మిగిలిన మతాల్లో దేవునికి ఒక రూపం కల్పించడం తప్పని రూపంలేని వానిని దర్శించడం సాధ్యం కాక,ఏదో ఉదయాన్నే చూడాల్సొస్తే,బాధలకు లో నౌతారు.అందుకోసమే విగ్రహా రాత్థన గానీ మరో కారణంతో విగ్రహారాథన రాలేదు.హైందవానికి తెలుసు.దేవుడు నిర్గుణుడు.నిరాకారుడు.స్వచ్చమైన వాడు.ఇలా అన్నీ,అయినా ఆయనకు ఎన్నో రూపాలూ,మరెన్నో ఆయుధాలనూ పెట్టి మనిషికి ధైర్యం కలిగేలా ఏర్పాటు చేశారు.ఇక హిందువులు నేను-నాది అనే ఊహ పనికి రాదన్నారు.అయినా అవసరమైన నేనుగాడు వచ్చి తీరతాడు.అది చిన్న పిల్లల్లో ఖచ్చితంగా అవసరం.అది లేకుంటే వారికి ఎదుగుదల వుండదు.ఆ వయసులోని పిల్లలు తప్పని సరిగా స్వార్థంతో వుండాల్సిందే! ఇది అత్యవసర "నేను". అసలు జీవిలో ఉన్న వారెవరు అంటే- ఆ ముగ్గురూ.బ్రహ్మ -విష్ణు -మహేశ్వరులు .దీన్ని హైందవం కనుక్కున్నది.ఒక వస్తువు దృస్యరూపంలో కనిపిస్తోందంటే,దాన్ని అక్కడికి తెచ్చి ఎవరో వుంచాలి.వాడు క్రియేటర్. సృష్టి కర్త.-వానిని బ్రహ్మ అన్నారు.ఇక ఆ వస్తువు గాని జీవి గాని చైతన్యంతో కదలాడుతూ,తన శరీరాన్ని పోషించుకుంటూ పెరుగుతూ ఉందంటే,దానికి కావలసిన స్థితి కారకత్వం ఇచ్చేటందుకెవరో ఒకరుండాలి.వాడే వారికి విష్ణువు.నారాయణుడు.నీరు పోసి బతికే ఏర్పాటు చూస్తున్నాడు.ఇక కృశించే పరిస్థితి.శరీరం కృశించి నశిస్తుంది. అందువల్ల ఈ పని చేసే వాడు మరొకడుండి వుండాలి.వాడే శివుడు-లయ కారకుడు.ఈ మూల సూత్రం పై ఆధార పడిసృష్టి యావత్తూ నడుస్తుందని తొలిగా చెప్పింది హిందువులే! సృష్టి స్థితి లయ కారకులకు ఒక పేరు పెట్టుకుని పిలిచారు. కాలానికి విభజన ఏది? లోకం కాలానికి అందదు.కాలాతీతం.దేవుడు కాలాతీతుడు.అయినా మనం కాలాన్ని విభజించాం.మూడుగా భూత భవిష్య వర్తమానాలుగా.అయితే,హిందువులకి మరోకాలముందని తెలుసు.త్రీడి పిక్చర్ వున్నట్టు,ఇది నాల్గవ కాలము మనుషికి తెలీనిది అందువల్లే వారి యుగాలు నాలుగయ్యాయి.కృత్.త్రేత,ద్వాపర,కలి అనే యుగాలు.ఇప్పుడు త్రిమూర్తులు మువ్వురే,కాని మరో మూర్తిస్వరూపం వుంది.వీరికి అతీతమైనది అది నాలుగుకు సంబంధించినది.అది హైందవం చెప్పింది.  

ఇక నేనును గూర్చి ఒక చిన్న కంద పద్యంలో చెప్పుకుందాం.

కం|| నేనును, నాదియు,ఊహల

      నా,నారాయణుని మాయన జనించు,హరుం

      డేననకుమ,వైరాగ్య

      మ్మూను మన ;విథాత గాంచు మోహన మురళీ|| 


పై పద్యంలో చెప్పినట్టు విష్ణు మాయ వల్ల,నేను-నాది-నా అనే అహం పుడుతుంది.యిది అత్యవసర అహం.ప్రాణులన్నిటికీ ఈ అహమే లేకుంటే,ప్రాణి తన పనులను తా చేయదు.ఇక శివుడు 'నేనూ అనొద్దని వైరాగ్యం పుట్టిస్తాడు. ఎంతమేరకు నేను అనాలో అంత మేరకే నేను అనాలిగాని,హిరణ్య కశిపునిలా అంతా నేనే! నేనే దేవుణ్ణి,నన్నే పూజించండి అనకూడదుగా మరి.అందుకే శివుడు వచ్చి కూచుంటాడు.లయం చేసి భస్మం చేస్తాడు.చివరగా విథాత దీనికంతటికీ సాక్షీ భూతునిగా వుండి,ఇదంతా చూస్తున్నా మౌనంగా వుండి పోతాడు. ఇది ప్రతి జీవిలోనూ వుండి ఆ మువ్వురు మూర్తులూ చేయించే పని. దీన్ని మొదటిగా హిందువులే విశ్లేషించి తమ హైందవంలో చెప్పారు.
నేను కూడా 'సత్యాన్నే', దైవంగా భావిస్తాను గావున ;అటువంటి నగ్న సత్యాలని హిందూ పురాణేతిహాసాలనించి వెలికి తీసి చూపాలను కోవటమే ఈ గ్రంథ రచన ముఖ్యోద్దేశం.
కళ్ళకు కట్టినట్టు నేటి ఆథునిక విజ్ఞాన శాస్త్రం పరిశోధనా పరంగా,సాక్ష్యాధారాలతో చూపిస్తుంటే,ప్రస్తుతానికి దాన్ని మనం నమ్మక తప్పదు.భవిష్యత్తులో ప్రస్తుతం నమ్ముతున్న సత్యం - అసత్యంగా మారితే;అప్పుడు దాన్ని మనం నమ్మక తప్పదు.ఎందుకంటే అప్పుడు అది సత్యమై కూచుంటుంది.ఒకప్పటి దృవనక్షత్రం నేడు మారిందని శాస్త్రజ్ఞులు చెప్పినట్టవుతుంది అది. సత్యాన్వేషణ నిరంతరాయంగా కొన సాగుతూ నే వుండాలి.ముందు ఊహాగానాలతో మొదలైనా,సత్య శోధనలో నిగ్గు తేల్చుకుని మారుతూ వుంటుంది.కట్టు కథలు ఓడి పోయి చివరకు సత్యం గెలుస్తుంది.
హీరో వర్షిప్ కానే కాదు హిందువులది. హిందూ నమ్మే దేవునిలో వుండ వలసిన లక్షణాలేవంటే-అద్భుతాలు చేయగలగాలి.శూన్యం లోనించి వస్తువుల సృష్టి,ఆహారాల సృష్టి, చనిపోయిన మనిషిని బతికించటం,రోగాలను నయం చెయ్యగలగటం వంటి విన్యాసాలు చేసి చూపిన వానిని దేవుడంటారు గానీ,ఇతనినీ దైవాంశ సంభూతుడంటారే గాని పూర్తిగా దైవమని ఆ అవతారం బతికున్నంత వరకూ కొలిచి ఆ అవతార సమాప్తి అయ్యాక (మరణించాక)మరల కొన్నేళ్లు స్మరించినా తరవాత కాల గతిలో మరుగున పడి దేవునిగా మిగలరు.ఆ విధంగా కాలగతిలో కలిసి పోయిన దైవ దూతలు-ముస్లిమ్ లకి పైగంబర్లు, క్రైస్తవులకు ఏసు క్రీస్తు మిరకిల్స్ చేయడమే కాక రోగులకు స్వస్థత కూర్చాడు.అందువల్ల,అతను తాను దేవుడిని అని చెప్పక పోయినా-తాను దేవుని కుమారుడిననీ,తనద్వారానే దేవుని చేరగలరనీ అనుట వలన చాలామంది ఆయన అనుయాయులయ్యారు.హిందూ పైగంబరులు-లేక గురువులు లేక దేవదూతలగా -లేక దైవాంశ సంభూతు లుగ కొలవబడ్డ వారు చాలమందే,ఉన్నారు.వారి పుట్టుక గిట్టుటలన్నీ రికార్డులకెక్కాయి. అయినా వారందరినీ హిందువులు దేవుడనలేదు.రాముడు దేవుడెందుకయ్యాడంటే- పరిపాలకుడెలావుండాలో తెలిపేలా ఒక చాకలి మాటకి విలువిచ్చి భార్యని పరిత్యజించి,ఏకపత్నీవ్రతం వల్ల మరో వివాహం చేసుకోకుండా ఆదర్శమైన జీవితం చూపాడు.తన పరిపాలనలో ప్రజల కష్ట సుఖాలని పట్టిచుకున్నాడు.దీనికో కథుంది.భరతుడు రాజ్యం చేసిన కాలంలో,భరతుడు పన్నులు వసూలు చెయ్య లేదు.రాజ్యాంగం గూర్చి పట్టించుకో లేదు.అంతా మా అన్న పరిపాలన అంటూ రాముని పాదరక్షలను సింహాసనం మీద పెట్టి పరిపాలించాడు.అందువల్ల,జనాలు పన్నులు ఇవ్వలేదు. ఖజానా నిండుకుంది. అప్పుడు రాముడు జనులకి నొప్పి కలుగ కుండా ఖజానా ఎలా నింపాలా అని ఆలోచించాట్ట.అందుకోసం జనాలనందరినీ పిలిచి ఎవరు రాజుగారి ఖజానా కు ఎంత బాకీ వున్నారో లెక్కలు తేల్చాడు. ఆ డబ్బు చాలా పేరుకుపోయింది.ప్రజలు అంత పన్ను కట్టలేమంటారు.అందుకోసం ఆలోచింసి వారి వారి బాకీలని బట్టి,వారిని గుమ్మిడి కాయలు ఆ ఏడాదికి పన్నుగా ఇమ్మన్నాడు.ప్రజలు చాలా ఆనంద పడ్డారు.అందరిదగ్గరా బంగారాలు ఇళ్లల్లో మూలుగుతున్నాయి అన్నేళ్లూ పన్నులు కట్టక పోవటంవల్ల.అయినా ఇంట్లో బంగారం వారికివ్వ బుద్ధికాదు. అందుకే గుమ్మిడికాయలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. సరిగ్గా గుమ్మిడి కాయలు దిగుతాయనగా ,రాములువారి భక్తులైన వానర సైన్యం ప్రవేసించి,మొత్తం గుమ్మిడి పంటంతా నాశానం చేసింది.ఎవరూ గుమ్మిడి కాయ ఇవ్వలేని పరిస్థితొచ్చింది.గుమ్మడికాయకి ప్రత్యామ్నాయంగా ఒక్కొక్కరూ గుమ్మిడికాయంత బరువు తూగే బంగారం ఇచ్చేటందుకు ఒప్పందం కుదుర్చుకుని,బంగారం తెచ్చి గుమ్మిడికాయతో తూకం వేయించి,ఇచ్చారట. ఆ విధంగా ప్రజలకు నొప్పి తెలియకుండా పన్ను వసూలైందట.ఇది కథే అయినా పాలకుడు తన ప్రజలనించి వసూలు చేసే పన్నులు ఒక పువ్వునించితుమ్మెద జుంటి తేనె,పువ్వుకు బాధకలక్కుండా జుర్రినట్టు జుర్రాలి అని చెప్పటమన్న మాట.చారులద్వారఆ ప్రజల కష్ట సుఖాలని విచారించి,అందరికీ,ఉపాధీ,తిండీ బట్టా వుండేలా చూశాడు.అడవులను నాశనం చెయ్యకుండా పరకృతిని పరి రక్షిస్తూ వర్షాలు సకాలంలో పడేటట్టు చూశాడు.కౄరమృగాలు ఎక్కువైతే,వేటద్వారా వాటిని నిర్మూలించి,ప్రజల ఆస్థికి ఢోకా లేకుండా చూశాడు.వర్ణవ్యవస్థని కాపాడాడు.దానివల్ల అందరికీ ఉపాధి కల్పించినట్టైంది.క్రతువులూ -యాగాలూ,యజ్ఞాలూ జరిపించి,ధనాగారంలో ఉన్న సొత్తును మరల ప్రజ;లకందుబాటయ్యేలా చేశాడు.మరల ఆ సొమ్మును ఇస్తినమ్మా వాయనం పుచ్చుకుంటినమ్మా వాయనం అన్నట్టు తాను జరిపే యజ్ఞ యాగాదుల్లో పారితోషికాలగా ప్రజలనించి స్వీకరించాడు.దీన్ని ఒక విధంగా వర్షం వ్చ్చి నదులు పారి సముద్రంలోకి వెళ్లి మరల ఆకాశ మార్గంలో పయనించి వర్ష రూపంలో భూమికి చేరినట్టన్న్న మాట.ఇలా వుంటే రాజ్యాంగం ఏ నాడూ గొడవలు రావు.అలా కాకుండా పాలకులు తమదగ్గర కొచ్చిన సొమ్మును ప్రజల సొమ్ముగా భావించక,స్వార్థ బుద్ధితో దాచేసి,వ్యసనాలకి ఖర్చు చేస్తే, అవినీతి పెరిగి,అల్లర్లు మొదలౌతాయి.అలా జరగనందు వల్లే,కులాల అడ్డు గోడలున్న నాటిరాముని రాజ్యం 'రామ రాజ్యం 'అని కీర్తింపబడింది.
ఇక కృష్ణుడు మొత్తం అద్భుతాలు చేసి చూపాడు బాల్యం నించే! తన నామస్మరణతో కష్టలను తొలగించాడు.కుచేలుని ఐశ్వర్యాలిచ్చాడు.ద్రౌపదికి మాన సమ్రక్షణ చేసిన వాడే ఒకప్పుడు బాలుడుగా వున్నప్పుడు గోపికల బట్టలెత్తుకెళ్ళాడు చిలిపిగా. దేవునిముందు మనిషి ఎప్పుడూ నగ్నంగా వున్నట్టే!పైకి మనం ఎన్ని బట్టలేసుకున్నా మనం నాలిక చివరన తేనె పూసుకు మాటాడినా ఏం చేసినా మన ఆంతర్యం దేవునికి తెలీదా? అదే ఆయన చెప్పాడు.బలరామునీ దేవుడన్నారే గాని ఈయనకు గుడికట్టి పూజించలేదు. పరశురామునీ దేవుడన్నారే కాని ఈయనకీ దేవాలయాలు లేనట్టే.వామనుడు దేవుడే గానీ ,ఈయనకీ ఆలయాలు లేనట్టే.మత్స్యావతారం-కూర్మావతారం,వరాహావతారం,నరసిమ్హావతారం.వున్న్న వాటికి దేవలయాలున్నయి.అయినా వీటి సంఖ్యా తక్కువే! రామునీ-కృష్ణ&#3


 
 

Trackback address for this post:

authimage

Comments, Trackbacks:

No Comments/Trackbacks for this post yet...

Leave a comment :

Your email address will not be displayed on this site.
Your URL will be displayed.
Allowed XHTML tags: <!, p, ul, ol, li, dl, dt, dd, address, blockquote, ins, del, a, span, bdo, br, em, strong, dfn, code, samp, kdb, var, cite, abbr, acronym, q, sub, sup, tt, i, b, big, small, img>
URLs, email, AIM and ICQs will be converted automatically.
Options:
 
(Line breaks become <br />)
(Set cookies for name, email & url)
Validation code:
Please enter the above code here:
For protection from spambots (case-sensitive).