Search blog.co.uk

రాంరళీయ షడ్వేదం!!-మొదటిభాగం-3.

by ramrali @ 2007-10-17 - 01:26:36

రాంరళీయ షడ్వేదం!!-మొదటిభాగం-3.
చదువు పూర్తి అయి గురుకులం నించి బయటకి వచ్చిన ప్రతి వ్యక్తికీ కొద్దో గొప్పో అన్ని శాస్త్రాల పరిజ్ఞానముంటుంది. ఎందుకంటే,వేదాల్లో అన్ని శాస్త్రాల జ్ఞానాన్నీ క్రోడీకరించి పొందు పరుస్తారు కావున!? ప్రతి వ్యక్తికీ ఆది గురువులు తల్లీ తండ్రే! ఎందుకంటే,వారి వారి ఇళ్లల్లో వారు తాము ఏ వృత్తి చేసి ఉపాధిని పొందుతున్నారో,ఆ వృత్తిని ఇంటిదగ్గర చిన్న తనంలోనే నేర్చుకుంటాడు. ఆ పై సమాజానికి ఉపయోగ పడే వ్యక్తిగా వీరిని గురుకులాల్లో మరింత తర్ఫీదు ఇచ్చి తీర్చి దిద్దుతారు.ప్రస్తుత శాస్త్ర వేత్తలు ఒక వేళ ప్రళయం వచ్చి,భూమిపై జీవరాశి నసిస్తే, భవిష్యత్తులో మరల జీవ రాశి ఆవిర్భవిస్తే; వారికి ప్రస్తుత సైన్సును ఎలా అందించాలనే తాపత్రయంతో, ఒక దుర్భేధ్య మైన నాళికలో మైక్రో ఫిల్మ్ స్ లో సైన్సు వివరాలు భద్ర పరచి,భూమి అట్టడుగు పొరల్లో ఎక్కడో నిక్షిప్తం చేస్తున్నట్లన్న మాట! పూర్వ కాలంలో బ్యాంకింగ్ వ్యవస్థ లేని రోజుల్లో,తమ వారసులకి (మనుమలకి) తమ వద్ద నున్న సొమ్ములను భూమిలో పాతి పెట్టి అందించేవారట. అలాగన్న మాట!వేదంలో అన్నిటికీ శాంతి వచనాలుంటాయి. ధర్మమన్నది వేద ప్రమాణికం హిందువులకి. ధర్మంలో స్వ-పర-సామాజిక ధర్మాలన్నీ యిమిడి వుంటాయి. స్వధర్మానికి ఎక్కువ ప్రాముఖ్యతుంటుంది. స్వధర్మంలో కుల వృత్తి కూడా వస్తుంది. తాను బతికుంటేనే కదా వైద్యుడు యితరులకు వైద్యం చేయ గలిగేది?! అందుకే వారు తమ మతం మనుగడ కోసం తమ తమ ధర్మాలని ఆచరిస్తూ,యితరులని కూడా అలాగే ఆచరించమని భోధిస్తారు. స్వధర్మంతో పాటు సమాజ శ్రేయస్సుకు కావలసిన ఇతర ధర్మాలని కూడా ఆచరిస్తారు. "ధర్మో రక్షతి రక్షితః" -వారి సూక్తి.
హిందువులు మనిషినీ ఇతర జీవ రాసులనన్నిటినీ దైవంగా భావిస్తారు. ఆకలితో వచ్చిన అతిథిని- (ఆకలితో వచ్చిన జంతువు నైనా) అతిథిని (తిథి-వారం నక్షత్రం లేకుండా వచ్చేవాడు అతిథి.)వానిని "అతిథి దేవో భవ!",అంటారు.వారు ఇంటికి అతిథి వస్తే,ముందు అతిథికి భోజనం (అన్న పానాదులు ) చూశాకే తాము భోజనం చేస్తారు.కుక్షిభరత్వంతో ఎవరైనా ఈ ద్ధర్మాన్ని ఆచరించరనే అనుమానంతో,అతిథిని దైవ స్వరూపుడు అని చెప్పారు.ఇప్పటికి హిందువుల దైవాల లిస్టు ఇది అనుకుంటే రాను రాను ఆ లిస్టు పెరుగుతూ పోతుంది. 1.మాతృదేవోభవ.2.పితృదేవోభవ.3.ఆచార్య (గురు)దేవోభవ.4.అతిథి దేవోభవ.ఇవి కాక వారికి సత్యమన్నది దైవం! "సత్యం వద ",వారి సూక్తి.అసత్యమాడినందువల్ల జరిగే అనర్థాలగూర్చీ,అసత్య దోషం వల్ల అంటే పాపం గూర్చీ వారికి ఎన్నో కథలున్నాయి.ఏకంగా సత్య హరిశ్చంద్రుడని ఆయనపైన ఒక కథేవుంది.ఇన్ని చెప్పినా కొన్ని రాయితీలు కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చారు.మాన-ప్రాణ -ధన హాని,వైవాహికములందు బొంకవచ్చునన్నారు. అయితే ఇటువంటి అబద్ధంకూడా,అనృత దోషాన్నించి తప్పించ లేదు. దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సిందే! ఉ|| ధర్మ రాజు యుద్ధంలో "అశ్వత్థా మా హతః కుజరః" అన్నందుకు (కుంజరః అని మెల్లిగా అన్నందుకే ఒక సారి నరకం చూడాల్సిన గతి పట్టిందనే కథ వుంది.అలాగే- శివుని జటాజూటాన్ని బ్రహ్మ చూశాడని తలతో చెబుతూ తోకతో చూడ లేదని అబద్ధపు సాక్ష్యం యిచ్చినందుకు ఆవుకు శాపం "ఉదయాన్నే ఆవు ముఖం చూస్తే పాపమనీ-తోక చూస్తే పుణ్యమనీ శివుడు ఇచ్చాడు. మొగలి పువ్వు అబద్ధమాడినందుకు పూజార్హతని కోల్పోయింది.ఇలాటి కథలు ప్రచారం చేసి,సత్యమే వజయతే అని ఎవ్రూ అబద్ధమాడకుండా తెలివి తేటలతో దైవం పేరిట కట్టడి చేశారు.ఇంత చక్కటి పద్ధతి అది?!సరే! రాజులు అబద్ధమాడినట్లు తెలిస్తే వేసే శిక్షలు కూడా కట్టడి చేశాయి.అయినా రాజాస్థానాల్లో కొన్ని పరిస్థితుల్లో అబద్ధమాడినందుకు శిక్ష పడదు.అంత మాత్రాన ఆ వ్యక్తి శిక్ష నించి తప్పించుకున్నట్టు కాదు. దైవ సన్నిధిలో శిక్ష అనుభవించాల్సిందే! అందుకోసం ప్రాయస్చిత్తం చేసుకోవాలి.ఇన్ని చేసినా పాపం తొలిగితే తొలుగుతుంది-లేకుంటే లేదు! దీని వల్ల ప్రాణంపోయినా అబద్ధమాడని పరిస్థితిలోనికి మనుష్యులను తీసికెళ్లారు. అందువల్ల నిక్కచ్చిగా వున్న వేదాలు మార్పు చేర్పులు లేకుండా నేటి దాకా వచ్చాయి. పర మతస్థులను ఆదరించే సహన గుణం హిందువులకు వుంది. " సహనావవతు-సహనౌ భునక్తు-సహవీర్యం కరవావహై,తేజస్వినావధీతమస్తు,మా విద్విషావహై, ఓం శాంతిః,శాంతిః శాంతిః!!" అని చదువుతారు.హిందువులు పర మతాన్ని ఎందుకాదరించారంటే- ఎవరు ఏ విథంగా ప్రయత్నించినా , అన్ని మార్గాలూ దేవుని చేరేటందుకేననీ,ఇతర మతాల వారు చెప్పేదాంట్లో కూడా సత్యముందనీ-(సత్యం హిందువుకు దైవం.తాను అబద్ధ మాడడు కాన ఇతర మతానుయాయులూ అబద్ధాలాడరని నమ్మిక)అందువల్ల ఎవరేది దైవం విషయంలో చెప్పినా వారు నమ్మేస్తారు. దేవుని ఎక్కడైనా ఎప్పుడైనా ఏ రూపంలోనైనా చూడ గలమని వారు నమ్మిన కారణాన పరమతస్థులు చెప్పే మాటలపై కూడా వారికి నమ్మకం గురీ కుదిరాయి.పైగా పరమతాలను స్వీకరించిన హిందువులు వారి మార్గంలో పయనించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు తమ వద్ద నున్న మనోనిశ్చలతతో!ఇదే విధంగా పర మతానుయాయులూ హిందూమతంలో ఆచరించే పద్ధతిలో పయనించి,ఉన్నత శిఖరాలనధిరోహించి మిగిలిన వారికి ఆదర్శ ప్రాయులయ్యారు. ఉ|| కబీరు,తుకారాం ముస్లిమ్ మతంలోని వారు. నేడు -హరే కృష్ణ అనుయాయులూ,సాయి భక్తులూ,రజనీష్ భక్తులూ ఇలా హిందూ వేదాంతుల వెనుక పడిన వారూ కనిపిస్తున్నారు. అలాగే హిందువులు కేరళ లోని సద్బ్రాహ్మణులు అనుకున్న వారు నంబూద్రులు కొందరు మొట్ట మొదటిగా క్రైస్తవ మతం స్వీకరించి ఆ మతానికి ప్రాచుర్యం కల్పించారు. హిందూ మతానికి ఫుల్ స్టప్ లేదు. అందువల్ల అది విస్తరిస్తూ పోతోంది.మిగిలిన మతాలకి ఫుల్ స్టాప్ పెట్టి -వీడే దేవుడు! ఇలాగే మాగ్రంథంలో రాయబడి వుంది అని అలాగే ఫాలో అవాలి అన్న కారణంగా ఆ మతాలు ఎదరకు వెళ్లకుండా అక్కడితో ఆగిపోయి సంకుంచించుకు పోతున్నాయి. సత్యాన్వేషణకు హిందూ మతం వెసులుబాటు కల్పించిన కారణంగా ఎవరికి వారు ఎవరి పద్ధతిలో వారు దేవుని దర్శించే ప్రయత్నం చెయ్యాలి అనబట్టి వారి మతంలోనించి అనేక మతాలు కుప్ప తిప్పలుగా పుట్టుకొచ్చాయి.తమ మతం కాని దాన్ని సైతాను మతమనిగానీ,తమ మతాన్ని అనుసరించని వానిని చంపడమన్నదిగానీ వారు బోధించలేదు. అందువల్ల అన్ని మతాలకూ హైందవం తల్లి -తండ్రి గానీ అయింది.హైందవమ్నించి పుట్టిన మతాలు-బౌద్ధం,సిక్కిజమ్ ,పార్శీ మతం,జైనిజమ్ ,శాక్తేయం,శైవం,నారాయణీయం, ఇవన్నీ హైందవంలోంచే పుట్టాయి.క్రైస్తవంలో కేథలిక్కులూ-ప్రొటెస్టెంట్లూ,ఇలా విడినా వారు కొలిచే దైవం మారలా!ముస్లిమ్‌సు లో షియాలూ-సున్నీలూ అని ఎన్నో తేడాలున్నా వారి దైవం మారలా! కాని హికందూ దైవం రూపు రేఖలూ మార్చుకున్నాడు,వారి మతానుచారాలూ మరాయి హైందవం నించి పుట్టిన ఉప మతాల్లో! to be contd.


 
 

Trackback address for this post:

authimage

Comments, Trackbacks:

No Comments/Trackbacks for this post yet...

Leave a comment :

Your email address will not be displayed on this site.
Your URL will be displayed.
Allowed XHTML tags: <!, p, ul, ol, li, dl, dt, dd, address, blockquote, ins, del, a, span, bdo, br, em, strong, dfn, code, samp, kdb, var, cite, abbr, acronym, q, sub, sup, tt, i, b, big, small, img>
URLs, email, AIM and ICQs will be converted automatically.
Options:
 
(Line breaks become <br />)
(Set cookies for name, email & url)
Validation code:
Please enter the above code here:
For protection from spambots (case-sensitive).