శ్రీరాంరళీయ షడ్వేదం!!-మొదటి భాగం-2.
యిక స్నానం చేసేటప్పుడు- గంగా-యమునా –సరస్వతీ, ఇత్యాది పవిత్ర నదులను స్మరిస్తూ,అక్కడ ఉన్న ప్రదేశంలోని నదినీ నీటినీ స్మరించి,'భగవత్పాదోదక స్నాన మహం కరిష్యే!' అంటూ చేయాలి.
ప్రస్తుతం హిందువుల్లో చాలా మంది ఈ పద్ధతిలో ఈ స్మరణ కార్యక్రమం (మంత్ర పఠనం-ప్రొసీజరు) చదువుతూ స్నానాలు చెయ్యటల్లేదు. అయితే ముఖ్య తిథుల్లో బ్రాహ్మణులు జరిపించే స్నాన తంతులో ఈ మంత్రాలు చదివి ఎలా స్నానం చెయ్యాలో చెప్పి చేయిస్తారు.నాడు ఒకదాని తరవాత ఒకటిగా ఇలా చదువుతూ చెయ్యడం వల్ల తప్పులు దొర్లకుండా సవ్యంగా అన్నీ జరిగేవి. ఇప్పుడ్లా లేనందువల్ల పద్ధతిలో మరుపు చోటు చేసుకుని ఏ పని తరవాత ఏదో మరచినా మామూలుగా నిత్యకృత్యం చేసేస్తున్నారు.(అలవాటైపోయిందిగా)నేటి సైన్సువిద్యార్థులు,ఎక్స్ పెరిమెంటు చేసేటప్పుడు,పుస్తకం పక్కన పెట్టుకుని చదువుతూ ఎక్స్పెరిమెంటు చేసినా, పరీక్షలో ప్రొసీజరంతా రాసి పుస్తకం లేకుండానే,ప్రాక్టికల్ చేసి చూపించాల్సొచ్చినట్టన్న మాట!
పూర్వకాలంలో లిపి లేదు.అందువల్ల ఈ పద్ధతిని హిందువులు పాటించి నేటిదాకా,శాస్త్రాలనన్నిటినీ లాక్కొచ్చి నేటి తరాలకి అందించారు.ప్రక్రియ పూర్తిగా కంఠోపాఠంగా ఉండేటందుకు,ఒక జాతిని దీనికోసమే నియోగించి ,అందరికీ వీరిని అందుబాటులో వుంచి,వారిద్వారా మంత్ర పఠనం అని ప్రామాణికంగా ఏ పని తరవాత ఏమి చెయ్యాలో చెప్పే జాతిని బ్రాహ్మణ జాతి అన్నారు.వీరే కాక గురువులుంటారు. వారు పద్ధతులు ఆచార వ్యవహారాలూ చెబుతారు. అదో ప్రత్యేక కులంగా అన్ని కులాల్లోనూ వున్నారు.లిపి వచ్చినా చాలా కాలం దాకా నేటి కాగితాలూ-ప్రింటింగ్ ప్రెస్ లూ వాడుకలోకి రాలేదు. తాళపత్రాల (తాటి ఆకుల పైన)మీద ఘంటంతో రాసేవారు.ఆ ఆకులు చదలు పట్టి పాడవ్కుండా ఏదేదో చేసినా కాలానికి తట్టుకోలేక చిరిగి పోయేవి.నాడు కొందరు గురువుల వద్దే ఈ గ్రంథాలుండేవి.లైబ్రెరీలు లేవు మరి!అందుకే ఎన్ని గ్రంథాలున్నా అన్నిటికన్నా జీవమున్న మనిషి గ్రంథం బెస్టు అని తెలుసుకుని ఈ ఏర్పాటు చేశారు హిందువులు. ఈ పద్ధతి విదేశీయులకి తెలీదు.అందువల్ల వారికి గతంలో ఏమైనా గ్రథాలున్నా తెలీవు.పైగా హిందువులు అన్నీ దేవుడు అని చెప్పి కంఠస్థం చేయించటంతో,దేవుని నమ్మి ఇదంతా దైవ కార్యంగా చేయటం జరిగింది. అందువల్ల హిందువులకు గతం పెద్దది. ఎన్నో లక్షల సంవత్సరాల చరిత్ర,సైన్సు,ఇతిహాసం,జాతకం,ఖగోళ శాస్త్రం అన్నీ సజీవంగా వుండి,అన్నిటికీ హిందువులే ఆద్యులనిపించుకున్నారు.విదేశీయులకి దాని వల్ల చరిత్ర భూమి వయసు నిర్ణయంలో,కార్బ డేటింగ్ అంటూ నేడు కనుక్కున్న పద్ధతిలో ఊహా జనిత కథలొచ్చాయి.ఇవి రోజు రోజుకీ మార్పు చెందుతున్నాయి. మరో సైంటిస్టొచ్చి తప్పు అని మారుస్తున్నాడు.ఇది వారి పద్ధతి. ఇది ఇలా మారి పోతూ ఎన్నేళ్లైనా సాగుతుంది. హిందూశాస్త్రం మారమన్నా మారదు.అందులో నేడు సైన్సులో చెప్పేవీ ఉన్నాయి మరి?!ప్రస్తుత భారతం లో వైదిక కర్మలు ఆచరించేవారూ-వైదిక కర్మల నభ్యసించేవారూ కరువౌతున్నారు.విదేశీ పోకడలు పోయి,డబ్బుతో అన్నీ కొలవడంతో,సంపాదనపై మొగ్గు చూపి,పారమార్థీక చింత అవసరం లేదనీ చనిపోయిన తరవాత జీవితమేమిటనే యోచనతో,బతికుండగా సుఖించడమే ధ్యేయంగా భావించి,భౌతికంగా చూసేదే లోకమనీ అనుకునే రీతివల్ల ఈ మార్గం వదిలారు.అయినా హిందువులకు మూలాల్లో హైందవం నేర్పిన పద్ధతీ-ప్రక్రియల వల్ల,ఇందిఉలో ఆరోగ్యసూత్రాలూ మిగతా శాస్త్రాలూ ఇమిడి వుండటం వల్ల హైందవం నిలబడి ఉంటోంది.ఈ వైదిక కర్మలన్నీ నిశ్చలతతో తడబాటు లేకుండా చెయ్యాలి. ముందు వెనకలవకూడదు.అందుకే హిందువులు పిన్న వయసులోనున్న శిష్యులను చేరదీసి వారి చేత వైదిక మంత్రాలని(సూత్రాలనీ-ప్రక్రియలనీ) వల్లె వేయించి,తిరిగి ఆ శిష్యులు తమ శిష్యులకు ఇవన్నీ నేర్పేలా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే గురుకుల వ్యవస్థ అన్నారు.తమ దగ్గర చదివే శిష్యులందరికీ ఒక గురువు భోజన సదుపాయాలు చూడ్డమంటే అంత తేలిక కాదు.అందుకే భిక్షాటన చేసి ఏ రోజు తిండినారోజు సంపాదించుకుని భుజించమన్నారు. ఇలా చదువుకునే విద్యార్థులకు భోజనం పెట్టడం ఒక పవిత్ర కార్యమని చెప్పి,ఇంటిముందు దేహీ అన్న వారికి తమకు కలిగిన దాంట్లోనే ఎంతో కొంత దానం చేసి తీరాలీనీ దాని వల్ల పుణ్యం వస్తుందనీ చెప్పి,హిందువులందరికీ బోధించారు. అంతే గాని హిందువులు ముష్టివారూ కాదు,వారివి ముష్టెత్తుకునే బతుకులూ కావు.తమ తలిదండ్రులని వదిలి విద్యార్జనకై ఎక్కడో నున్న గురువులను ఆశ్రయించి చదువుకోవటమంటే మాటలు కాదు.అందుకే ఈ ఏర్పాటు.గురుకులంలో వుంటే,అక్కడి పరిసరాల్లో నున్న నదులూ,తటాకాలూ,బావుల దగ్గర స్నానాలు చేసి,దూరంగా జన సంచారం లేని చోట కాల కృత్యాలు తీర్చుకుని విద్య నభ్యసించటం చేసేవారు.అందువల్ల ఈ కాల కృత్యాల గూర్చీ వారికి పూరాగా ఆరోగ్య పద్ధతులను భోధించేవారు. దీని కోసం సూర్యోదయం కాక ముందే నిద్ర లేవటం,నిత్యకృత్యాలు చెయ్యటం భగవంతుని స్మరిస్తూ,శ్లోకాల రూపంలో విద్య నభ్యసించటం చేసే వారు.ఈ వ్యవస్థని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత రాజుమిదే కాక (పరిపాలకులు) ప్రజల మీదా వుంది. నేటి గురుకుల విద్యాసంస్థలన్నీ బాగా డబ్బులున్న వారికే అందుబాటులో వున్నాయి. నాటి కాలంలో ధనికా- పేదా తేడాలేకుండా అందరూ భిక్షాటన చేసి తిండి తెచ్చుకోవాలి.ఎవరికీ తలిదండ్రులు ధనమిచ్చి చదవ మనటం జరగలేదు. విద్యార్జన పూర్తి చేశాక కూడా,గురువుకు శిష్యుడు తానే ఏదో సంపాదించి గురు దక్షిణగా ఇవ్వాలి.అంతే గాని,తల్లిదండ్రులనడిగి ఇవ్వక్కర్లా! దీనివల్ల ఎందరు పిల్లలున్నా వారి చదువు గూర్చి నిశ్చింతగా వుండేది నాటి జనులకు.అంతటి ఉత్తమ వ్యవస్థ నాశనమై,నేడు ధనికులకే చదువు అందుబాటులోకొచ్చిన దుస్థితికి కారణం నేటి విద్యావిధానం.గురువుకు వప్పగించిన తమ పిల్లల బాగోగులు చూడవలసిన బాధ్యతంతా ఆ గురువుదే! అందువల గురువులు విద్యా బోధలు చేసేటప్పుడు,తమదగ్గరున్న విద్యార్థుల చేత తన స్వంత పనులన్నీ చేయిచుకునేవారు.ఎవరి పని వారు చేసుకుంటూ పొరుగు వారికి సేవ చేసే (సమాజానికి సేవ చేసే)ఉత్తమ లక్షణం నాటి విద్యార్థుల్లో అలవడి వారు భవిష్యత్తులో దేశానికి పనికి వచ్చేవారు కాగలిగారు.నేటి విద్యా వ్యవస్థలో కనిపిస్తున్న క్రమ శిక్షణా రాహిత్యం నాడు లేక పోవటానికి కారణం నాడు విద్యనభ్యసించే పద్ధతే! To be contd.
Friends (17)
Search
Archives
- November 2007 (4)
- October 2007 (16)
- September 2007 (8)
- August 2007 (27)
- July 2007 (32)
- more...
శ్రీరాంరళీయ షడ్వేదం!!-మొదటి భాగం-2.
by ramrali
@ 2007-10-15 - 23:56:37
Trackback address for this post:
Comments, Trackbacks:
Leave a comment :
Recent Posts
-
HINDUISM-7.
on 2007-11-14 -
Hinduism-6.
on 2007-11-12 -
HINDUISM-5.
on 2007-11-07 -
HINDUISM-4.
on 2007-11-06 -
HINDUISM-3. Further continuation.
on 2007-10-30 -
Hinduism-2. continued.
on 2007-10-25 -
HINDUISM IS NOT A RELIGION!! -1.
on 2007-10-23 -
శ్రీ రాంరళీయ షడ్వేదం!!-మొదటిభాగం - 6.
on 2007-10-19 -
రాంరళీయ షడ్వేదం!! మొదటి భాగం-5.
on 2007-10-18 -
శ్రీ రాంరళీయ షడ్వేదం!!-మొదటి భాగం-4.
on 2007-10-18













No Comments/Trackbacks for this post yet...