Search blog.co.uk

దయ్యాల భూమిలో దేవతలు!!-Kavitha-17

by ramrali @ 2007-09-29 - 06:08:03

దయ్యాల భూమిలో దేవతలు!!

దయ్యాల భూమిలో దేవతలడుగెట్టాయి!
దైవం పేరిట దయ్యాల మనసులు మార్చాలని
ధర్మ రక్షణ చేయాలనుకున్న దేవతలు
దయ్యాలకు సూక్తులెన్నో చెప్పాయి!!
తమ భూమిపై అడుగిడిన దేవతల పై
దయ్యాలెంతో కోపించాయి!
దేవతలు చెప్పే హితాలు అహితాలు కాగా
దయ్యాలన్నీ దేవతల నిహతుల చేస్తున్నాయి!
అయినా కానీ,దేవతలెంతో ఓర్పుతో
హితోక్తుల పలుకుట మాన కుండె!!
పరిస్థితులనర్థం చేసుకున్న దయ్యాలు
మార్పు - చేర్పులతో కొత్త పుంతలు తొక్కాయి!
ఆ పై;దేవతల ముసుగేసుకున్న దయ్యాలు
మర్జాల సూక్తుల వల్లిస్తూ
మందిని మ్రింగుట మొదలిడి
మేదినిలా పెరిగాయి!!
దయ్యాలను గుర్తించలేక దేవతలు
కట కట లాడి-కళ వెళ పడ్డాయి?!
గో ముఖ వ్యాఘ్రాలనూ,పయోముఖ విష కుంభాలనూ
మేకవన్నె పులులనూ-వేదాఆలను వల్లించే దయ్యాలనూ
ఏ నాటికీ గుర్తించలేక దేవతలు
దయ్యాల పాల బడి వెతలు చెంది విసిగిన దేవతలు
దయ్యాలను వాటి కర్మకు వాటి నొదిలి
తమ స్వర్గానికి పలాయన మై పోయాయి!
స్వేఛ్ఛా వాయువుల పీల్చి , ఇప్పుడా
దయ్యాలు తమలో తాము కాట్లాడు కుంటూ
ఒకర్నొకరు దోచుకుంటూ,
చంపుకుంటూ-నరుక్కుంటూ
తమ భూమిని దయ్యాల స్వర్గ మనుకుంటున్నాయి!!


 
 

Trackback address for this post:

authimage

Comments, Trackbacks:

No Comments/Trackbacks for this post yet...

Leave a comment :

Your email address will not be displayed on this site.
Your URL will be displayed.
Allowed XHTML tags: <!, p, ul, ol, li, dl, dt, dd, address, blockquote, ins, del, a, span, bdo, br, em, strong, dfn, code, samp, kdb, var, cite, abbr, acronym, q, sub, sup, tt, i, b, big, small, img>
URLs, email, AIM and ICQs will be converted automatically.
Options:
 
(Line breaks become <br />)
(Set cookies for name, email & url)
Validation code:
Please enter the above code here:
For protection from spambots (case-sensitive).

Footer

The content of this website belongs to a private person, blog.co.uk is not responsible for the content of this website.