వరం ప్రసాదించు భగవాన్!!
దేవుడా! నేనిప్పుడు తెలుసుకున్నాను..
నేను రాక్షసులమధ్యనీ.. దుర్మార్గుల మధ్యనీ..
బతుకుతున్నానని!
అందుకే నేనిప్పుడీ వరాలని కోరుకుంటున్నాను?!
నేను విషానికి విషం గామారాలి!
నన్ను కాటేసిన పాము నావిషంతో మరణించాలి!
నన్ను కుట్టిన దోమలు..చీమలు...
తేళ్లు.. నా రక్తంపీల్చిన నల్లులు
సమస్త జీవజాలాలూ..
నన్ను మింగడానికి రాబోయే..
సింహాలూ..పులులూ ...
నా పై లంఘించబోతే కడుపునొప్పితో
అక్కడికక్కడే గిల గిల కొట్టుకు చావాలి
నాకు ఏ మనిషైనా చెడు తలబెడితే
వాడికే ఆ చెడు జరగాలి-
నా కేసి కన్నెత్తి చూస్తే ..
నన్నన్యాయం చేయాలనుకుంటే..
అక్కడికక్కడే పడి కొట్టుకు ఛావాలి
అలాగైతెనే ఈ లోకంలో నా జోలికెవరూ రారు!
లేకుంటే నా మంచితనాన్ని నా చాతకాని తనమనుకుంటున్నారీ ప్రజ!!













No Comments/Trackbacks for this post yet...