Search blog.co.uk

ఒక్కోసారి నా లాటి వాడి అవసరమూ ఉంటుంది!!kavita-16

by ramrali @ 2007-09-27 - 14:31:57

ఒక్కోసారి నా లాటి వాడి అవసరమూ ఉంటుంది!!
నన్ను అక్కడ కూలేశారు
క్రికెట్ మ్యాచ్ బ్రహ్మాండంగా సాగుతోంది
ఈల్ల జోరందుకుంది! ఆట రసవత్తర ఘట్టాలు
తాడో పేడో తేలే పరిస్థితి
ఈల లేశాను - నెగ్గాలి ఇండియా అని అరిచాను
నా ఉద్వేగం ఆగ లేదు -
హమ్మయ్య! నెగ్గేశాను!! మన ప్రత్యర్థినోడించేశాను!!!
కళ్లవెంట ధారా పాతంగా నీళ్ళు కారాయి
ఆనంద భాష్పాలవి!
యుద్ధం జరుగుతోంది!
War - War!! హిందూ సోల్జర్లు
శత్రుసైన్యాల్ని మట్టు పెట్టేస్తున్నారు
అదిగో భారత దేశ విజయ పతాకం ఎగిరింది!
జై! భారత్!! అరిచాను గట్టిగా!!
క్రీడా కారుడిగా పరుగు పందెంలో
ఎదరకు దూసుకుపోతున్నాను లక్ష్యం వైపు
మరొక్క సెకను మరొక్క సెకను
వేగం పెంచితే చాలు - నాకే మొదటి బహుమతి!!
హమ్మయ్య! నెగ్గేశాను!!
మనసు ఆహ్లాదంతో కేరింతలు కొట్టింది!
లాంగ్ జంప్,హై జంప్ - ఇలా అన్నిట్లోనూ
నేనే..ఫస్ట్! నేనే ఫస్ట్!!
గాట్టిగా అరిచి - ఆ పై భోరునేడ్చేస్తున్నాను
అమ్మ పరిగెత్తుకొచ్చింది!
"ఏరా కన్నా!! ఏమైందిరా?”, అంది.
అమ్మా అన్నింట్లోనూ మన దేశం ముందుందమ్మా!
"అన్నిట్లోనూ నేనే ఫస్టు!",అని భోరునేడుస్తూ
నా చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాను
అమ్మ హృదయం బాధతో విల విలాడింది!
ఆమె నన్ను గుండెలకు అదిమి పట్టుకుంది!?
"కన్నా!కన్నా!! ఏడవకమ్మా!!",అంటూ!?
నాలో ఆవేశం పెరిగింది!"అమ్మా నేను వ్యర్థ జీవిని!
నేను నా దేశానికి ఏ విధంగానూ ఉపయోగ పడను!
కదమ్మా! నేను చచ్చిపోతానమ్మా! నన్ను చంపెయ్యమ్మా!-
అసలు నన్నెందుకు కన్నా వమ్మా?",అని అరిచాను!
"లేదు కన్నా! నీ అవసరం నాకుంది!
నాకే కాదు కన్నా -ఈ దేశానికి వుంది
ఆ రోజు వస్తుంది! తప్పకుండా వస్తుంది!!
నువ్వు ముందు శ్రద్ధగా చదువుకో!
నీకు నేను అండగా వుంటాన్రా!", అని
ఆ రోజు అమ్మ నన్ను ఓదార్చింది!
మృత్యుముఖంలోకి పోకుండా ఆపింది!!
ఆమె అందించిన ధైర్యం-స్ఫూర్తి
నన్నిప్పుడింత వాణ్ణి చేసింది
నాడు కంప్యూటరు ఎదర కూచుని
అన్ని ఆటలూ పుట్టుకతో వికలాంగుడి నైన
నేనే ..ఆడుకుంటున్నట్టు భావించి ఆనందించాను
నా దేశానికి నేనే ఎనలేని కీర్తి తెచ్చినట్లు భావించాను
ఇప్పుడది నిజమైంది!
నేను భారత దేశ సైనిక దళంలో
ఉద్యోగి నయ్యాను! రిమోట్ కంట్రోల్ తో
శతృ స్థావరాలను ఛేదించగల
క్షిపణులను అవసరాన్ని బట్టి
ప్రయోగించేటందుకు సిద్ధంగా
యుద్ధ భూమిలో నాస్థానంలో నేను
కూచుని-శతృవుల నోడించి భారత దేశ
మువ్వన్నెల విజయ బావుటా నెగరేశాను!!
నా తోటి సైనికులు నన్నెత్తుకుని ..
భారత దేశాద్యక్షుని దగ్గరకు
మోసుకెళ్లారు-నాకు ఆయన గౌరవ పురస్సరంగా
ఇచ్చే బహుమతినిస్వీకరించటానికి!!
నా కనులు చెమ్మగిల్లాయి!!
నా ఈ విజయానికి కారకురాలైన ..
నా అమ్మ ఇప్పుడు లేదు!
నన్ను ఆత్మ హత్య చేసుకోకుండా
కాపాడిన ఆ అమ్మ మరో లోకంలో వుంది!!
నన్ను అక్కడుండి ఆశీర్వదిస్తోందని భావిస్తున్నాను!?


 
 

Trackback address for this post:

authimage

Comments, Trackbacks:

No Comments/Trackbacks for this post yet...

Leave a comment :

Your email address will not be displayed on this site.
Your URL will be displayed.
Allowed XHTML tags: <!, p, ul, ol, li, dl, dt, dd, address, blockquote, ins, del, a, span, bdo, br, em, strong, dfn, code, samp, kdb, var, cite, abbr, acronym, q, sub, sup, tt, i, b, big, small, img>
URLs, email, AIM and ICQs will be converted automatically.
Options:
 
(Line breaks become <br />)
(Set cookies for name, email & url)
Validation code:
Please enter the above code here:
For protection from spambots (case-sensitive).

Footer

The content of this website belongs to a private person, blog.co.uk is not responsible for the content of this website.