నాడు - నేడు . . .నాగరికత?!
ఒకనాడు భారతీయ ఋషులు కొందరు దిగంబరంగా తిరిగేవారు
గోచీల తో తిరిగేవారు .. స్నానం చెయ్యగానే . . .
గజస్నానంలా ఒంటికి బూడిద పూసుకునేవారు
మరికొందరు శరీరానికి బురద పట్టించి అలాగే ఎండలో ఆరేలా చేసుకునేవారు
ఉఛ్వాస నిశ్వాసల నియంత్రించేవారు ...
శూన్యంలోకీ ఆకాశంలోకీ చూస్తూ
కనిపించని దైవాన్ని ప్రత్యక్షం చేసుకునేటందుకు ఆరాథించేవారు!
లోకంతో సంబంధం లేకుండా ఈ లోకంలో బతికేవారు
వారిదంతా పార లౌకిక చింత!అందరూ సుభిక్షంగా ఉండాలనే తపన!!
పరిసరాలతో సంబంధం లేకుండా ఉండటం!!
ఎండ కెండి-వాన తడిసి - చలికీ -వేడిమికీ తట్టుకునేలా
శరీరాన్నలవాటు చేసుకునే ప్రక్రియ అది!
అనారోగ్యమెరుగరు-ఆరోగ్యం వారి స్వంతం!
పాశ్చాత్యులు భారతదేశానికొచ్చి . .
పాపం అనాగరికులు!! తిండికీ బట్టకీ కరువు అందుకే అలా ఉన్నారు
అనుకున్నారు! అదే విషయం అందరికీ చెప్పి ప్రచారం చేశారు
తాము భారతీయులకి నాగరికత నేర్పామని డాంభికాలు పోయారు!?
నిజంగా పాశ్చాత్యులు ఏమి నేర్పారు??ఆలోచించాల్సిందే!!
భారత దేశపు మగ వారు ఎలాగున్నా ..
స్త్రీల విషయానికొస్తే . . ఏడు గజాల-ఎనిమిది గజాల చీరలో
అందంగా . . హుందాగా . . . ఉండేవారు!
కొందరికి రైకలు లేకున్నా నిండుగా చీర కట్టుకుని
శరీరాన్ని చక్కగా కప్పుకునేవారు . . నాభి కూడా కనిపించకుండా!!
ఒకటి రెండు బట్టలతో ఉన్న దాంతోనే సంతృప్తిగా బతికారు!
లౌకిక వాంఛలకన్నా మరణం తరవాత జీవితం గూర్చి ఆలోచించేవారు
అందుకే ఎవరికీ అపకారం . . చీమ క్కూడా తలపెట్టేవారు కాదు!!
ఇప్పుడు నాగరికత పెరిగిన పాశ్చాత్యులకి
బట్ట అవసరం కనిపించటల్లా!? స్ట్రీకింగ్ . . నూడ్ బ్యూటీ పాషన్ షో లొచ్చాయి!!
చదవకముందు కాకర కాయ అంటే . . చదువుకుని కీకరకాయ అన్నాట్ట!!
అలాటిదే ఇది! కరువు వల్ల తిండికి నోచుకోక పోయి
ఉపోషాలతో పస్తులుండటంలో తప్పు లేదు!
తిండికి ఉండీ-జీర్ణం చేసుకునే శక్తి ఉండీ ..
అందం కోసం ప్రాకు లాడుతూ . .
సన్న బడాలని డయటింగ్ చేసే భామల కన్నా దౌర్భాగ్యం మరోటి లేదు
వంటి నిండా కప్పుకుందుకు బట్టా- డబ్బూ ఉండీ
దరిద్రుల్లా రోడ్డువార పోయే బిచ్చగత్తెలా
సముద్రపొడ్డున సూర్య స్నానం అంటూ
నగ్నంగా పడుకునే పాశ్చాత్య భామలు
అందాల పోటీ అంటూ అర్థ నగ్నంగానూ . .
కొండొకచో నగ్నంగానూ వేదికలెక్కి నడిచే భామలు
డిస్కో-కాబరే నృత్యాలంటూ ఒక్కొక్క బట్టే వొలిచి
తమ శరీర సౌందర్య లావణ్యాలని చూపాలని
తపించే పాశ్చాత్య నాగరికతలు . . నేడు పెరుగుతున్నాయి!!
సముద్రం వొడ్డున గోచీ పెట్టుకుని-
గుండెలకి పలుచని నైలాన్ వస్త్రాన్ని అడ్డం పెట్టుకుని
శరీరం చూపటమే లక్ష్యంగా నర్తించే భామలు
నేటి పాశ్చాత్య అనుకరణ చేసే భామలు . . వీరిది ఏమి దౌర్భాగ్యం?
అవును వారే నిజంగా.. నిఝంగా భారతీయులకి
నాగరికత నేర్పారు!!బట్టలెలాకట్టుకోవాలో
సంస్కారమంటే ఏమిటో . . డబ్బుతో లోకాన్ని ఎలా కొనాలో
డబ్బుకే ప్రాథాన్యతనిచ్చే సంస్కారాన్నీ నాగరికతనీ
భారతీయులకి నేర్పారు!!ఆవేశ-కావేషాలూ ..
నిత్య సుఖాల్లో ఓలలాడ టం నేర్పారట
వారు రాక పూర్వమే అదీ ఒక పద్ధతి ఉంది!
భంగూ-గంజాయీ - సురా పానం చేసే ఒక జాతి
ఆ జాతి ప్రజలకు దూరంలో ఉండేది భారత దేశంలో!!
Friends (17)
Search
Archives
- November 2007 (4)
- October 2007 (16)
- September 2007 (8)
- August 2007 (27)
- July 2007 (32)
- more...
నాడు - నేడు . . .నాగరికత?! Kavitha-13
by ramrali
@ 2007-09-19 - 13:46:53
Trackback address for this post:
Comments, Trackbacks:
Leave a comment :
Recent Posts
-
HINDUISM-7.
on 2007-11-14 -
Hinduism-6.
on 2007-11-12 -
HINDUISM-5.
on 2007-11-07 -
HINDUISM-4.
on 2007-11-06 -
HINDUISM-3. Further continuation.
on 2007-10-30 -
Hinduism-2. continued.
on 2007-10-25 -
HINDUISM IS NOT A RELIGION!! -1.
on 2007-10-23 -
శ్రీ రాంరళీయ షడ్వేదం!!-మొదటిభాగం - 6.
on 2007-10-19 -
రాంరళీయ షడ్వేదం!! మొదటి భాగం-5.
on 2007-10-18 -
శ్రీ రాంరళీయ షడ్వేదం!!-మొదటి భాగం-4.
on 2007-10-18













No Comments/Trackbacks for this post yet...