by
ramrali
@ 2007-09-28 - 11:34:25
తాగుబోతు-తిరుగు బోతు!!
Every action will be having a reaction is the phenomenon of Hindu God(s)రాముడున్నాడా?రామాయణం నిజానికి జరిగిన వాస్తవ కథేనా? హిందూ దేశంలో పుట్టి ఇన్నేళ్లు గతించాక వీటి పైన ఆలోచన చేసి కొట్లాడుకోవటం క్షేమం కాదు. హైందవం జవసత్వాలు గల మతం. దానికి ఆ జవ సత్వాలు రావటానికి కారణం వారి పూర్వీకులూ,వారు దేవునిమీద రాసి వుంచిన పురాణ గాధలూ,వేదాలూ -వాటి ఉపాఖ్యానాలు. హిందూ దేవుళ్ల కందరికీ జీవితం నిర్యాణం (అవతార సమాప్తి)చరిత్రలున్నాయి. ఇంకా వారందరూ ఆదర్శమైన జీవితాన్ని గడిపినట్లు ఉంది.
తాగు బోతు-తిరుగు బోతు!
రాము డున్నాడా? రామాయణం జరిగిందా లేదా? అని హేతు వాదులు ఆలోచించి,రాముడు ఒక అభూత కల్పనగా కొట్టి పారేశారు. ఇందులో సంతోషించ దగ్గ విషయ మేమంటే అలా అన్న వారు,రాముడు లేడు అభూత కల్పన అన్నారు గానీ,వాల్మీకి లేడు అన నందుకు సంతోషిద్దాం! అందులో వారు వాడిన పదజాలం "రాముడు తాగుబోతు", అని.తాగుబో తులంటే ఎవరు? అసలు తాగని వారు వుంటారా? అని అంటే-వచ్చే సమాధానం-అందరూ తాగుబోతు లేనని.ఈ తాగుడులో చాలా వెరైటీస్ వున్నాయి. సోమ పానము-సోమ లతనించి తీస్తారట? ఇది పూర్వకాలం వాడే వారట. అది ఇప్పుడు మనకి తెలీదు.దీన్ని సురలూ-భూసురులూ, అందరూ సేవించే వారుట.రెండు -కల్లు,3.పులవ బెట్టిన కల్లు,ఇందులో ఈత,జీలుగు,ఇలా అన్ని వృక్ష జాతులవీ వున్నాయి. దేనికి దానికి సెపరేట్ గుణా లుంటాయి. పూర్వం ఎవరింట్లో వాళ్లే స్వంతంగా ఇవన్నీ తయారు చేసుకుని సేవించే వారు.
రాము డున్నాడా? రామాయణం నిజానికి వాస్తవంగా జరిగిన కథేనా? దేవదాసు నిజంగా వున్నాడా?(క్షమించాలి.కరుణానిధిగారు రాముని తాగుబోతు అన్నందువల్ల వెంటనే దేవదాసు గుర్తొచ్చి కంపేర్ చేస్తున్నా గాని, ఇద్దరికీ సంబంధం ఏమిటి? ఒకడు దేవుడు మరోడు దేవునికి దాసుడు.)రాముడు వాల్మీకి బుర్రలో పుడితే, దేవదాసు శరత్ బుర్రలో పుట్టాడు. రాముడు పుట్టక ముందే రామాయణం రాయటం వల్లా,(నారద మంత్రోప దేశం వల్ల-"మరా") అప్పటికి రామాయణం జరిగి వుండలేదు అనేది నిర్వి వాదాంశం.అయితే ఆ తరవాత రాముడు పుట్టాడు. అందువల్ల ఉత్తర రామాయణం వాల్మీకికి రాయటం సుసాధ్యమైంది అంటారు. రాముని దేవుడు కాదనుకున్నా ఈ సంసార సముద్రాన్ని తరణం చేసే టందుకు "రామ",అన్న శబ్దం తారక మంత్రంబై కూచుంది. తరింప చేసేది తారక మంత్రం! రామాయణం లోని సుందరకాండ పారాయణం చేసి కుష్ఠు వ్యాధిని తొలగించు కున్న వారూ ,కష్టాలనించి గట్టెక్కిన వారూ కో కొల్లలుగా జనాలు వున్నారు.కబీరు,పోతన,రామదాసు,తుకారాం -ఇలా చరిత్రలో ఎందరో మనకు కని పిస్తారు. ఒక వేళ వీరు తరించ లేదు అని అనుకున్నా కనీసం రామ నామ స్మరణలో మనశ్శాంతిని పొందారు. భగ్న ప్రేమికులు దేవదాసు సినిమా చూసి ప్రేమలో విఫలమై, తాము తాగుబోతులుగా మారాలి కామోసు అనుకుని తాగుబో తులైన జనులు కోకొల్లలుగా వున్నారు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచు కోవాలి.ఏసు క్రీస్తు అప్పటికి పుట్ట లేదు. క్రీస్తు పుడతాడనీ,అప్పుడు నక్షత్రం మెరుపు గొడవా ఎన్నో ఉన్నాయి. దాని ఆధారంగా కష్టాలు అను భవిస్తున్న వారు దేవుని కుమారుని రాక కోసం ప్రయాణం చేసి వెళ్లినట్లు బైబిల్ చెబు తుంది.ఇప్పుడు క్రీస్తు ఖచ్ఛితంగా పుట్టాడని తెలుసు.ఆయన పేరిట క్రీస్తు శకం మొదలైంది. చరిత్ర గతించిన కొద్దీ మరుగున పడి పోతుంది. అదే జరిగింది.ఉ|| శాతవాహన శకం,కల్క్యాబ్ది శకం, ఇలా ప్రతి పెద్ద పేరిట ఎన్నో శకాలున్నాయి. వాటిని బట్టి అవి జరిగాయని తెలుసు కుంటాం.దేవదాసు అనేవాడు నిజానికి పుట్ట లేదు. కాని ఆ దేవదాసు సినిమా తీసి,నాటకాలు వేసీ నటులు దానికి ప్రాచుర్యం కల్పించి దేవదాసుని చిరస్మరణీయుని చేసి పారేశారు.రచయితలూ-కవులూ ఏది వ్రాసినా దానికి ఒక ప్రయోజనాన్ని ఆశిస్తారు. రామాయణం రాయటానికి సమాజంలో నాడు వున్న బహు భార్యాత్వాన్నీ,MIGHT IS RIGHT అనే వ్యవస్థని తొలగించి , సర్వ జనాళీ (ముఖ్యంగా స్త్రీలు ) సుఖ సంతోషాలతో బతికేటందుకు రాయటం జరిగితే-;దేవదాసు పాత్ర మనసులోని ప్రేమను బట్టి నడుచుకోవాలే గాని పెద్దలు చేసిన పెళ్లిళ్ల వల్ల ఎటువంటి నష్టం కలుగు తుందో చూపాడు. నాటి వ్యవస్థలో మనస్సుకన్నా ఆచార వ్యవహారాలూ-కుల మతాలకు ఎక్కువ ప్రాముఖ్యత వుంది.మార్పు కోసం రాసినది.దీని వల్ల కొందరు తమకు నచ్చిన స్త్రీని వివాహ మాడి జీవితంలో సుఖం పొందారు.ఆ విధంగా శరత్ కృత కృత్యుడ య్యాడు.అయితే,తాను ప్రేమించిన స్త్రీ వివాహ బంధం వల్ల పరాయి వాని (సొత్తు?) భార్య అయితే,