Search blog.co.uk

ఊసరవిల్లి-3-Stage performance .Nagpur,Photos.-2

by ramrali @ 2007-08-25 - 10:35:51

1965-Usaravilli-play-let Andhra Students\' Assn. members .played at Nagpur ,in help to NDF1965-Usaravilli play-let on the stage performance.
From Left:-Photo-1.
     1. Sri S.V Ramana Murti (Secrtory Andhra Students' Association,Nagpur-1965-66.)as   Venkanna.
     2.Sri.P.Murali Mohana Rao,(Author&Writer.),as Lawyer.
     3.President (Andhra Students' Association,Nagpur 1965-66.)Organiser.
     4.Maharashtrian Lecturer, Music Director.(Violinist.)
     5.Sri. Saranga Pani. as PrakAsam.
     6.Sri.Sarabhayya as Subbayya.
From Left :- Photo-2. Last Scene.
     1.Subbayya.- actor-Sarabhayya.
      2.Lawuyer Sankaram- actor-Mr.P.Murali Mohana Rao.(Student Vetrinary College,Nagpur)
      3. Venkanna - actor- Sri.S.V. Ramana Murty.
      4. Prakasam - actor- Sri Sarangapani.

 Gun                  Gun 
contd..ఊసరవిల్లి-3
శం:- చెప్పడానికేముంది? ఆ దొంగతన మేమిటో నాకు తెలీదు. ఆ వజ్రాల హారం గొడవ అసలే తెలీదు.
ప్ర:- ఇప్పుడు నువ్వు చూస్తున్నదీ నా చేతిలో వున్నదీ వజ్రాలహారం.ఇది ఇంత చప్పున నా చేతిలోకి వస్తుందని నే ననుకో లేదు. మరో వజ్రాల హారమేదీ ఇక్కడ లేదు.ఇప్పుడీ వజ్రాల హారం సంగతే నేనడుగుతున్నది.
శం:- ఆ వజ్రాల హారం నాదని నేను రుజువు పరుచుకో గలను. నువ్వు నన్ననవసరంగా అనుమానిస్తున్నావు.
ప్ర:- అవసరమో ,అనవసరమో నాకు బాగా తెలుసు. జైల్లో పెట్టించి కోర్టు కీడ్పిస్తే అంతా తేలి పోతుంది.
శం:- ఒరే! ప్రకాశం! నిజం చెబుతున్నానురా! నాకా దొంగతనం సంగతే తెలీదు.అసలు ఏ వజ్రాల హారమో ,ఏ దొంగతనమో కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పరా?
ప్ర:- అదే! జమీందారు రాయణిం గారిల్లు కాలిపోతున్నప్పుడు జరిగిన చోరీ గురించి!
శం:- రాయణిం గారింట్లో చోరీయా? ఇల్లు కాలి పోతున్నప్పుడా? అదేం నాకు తెలీదే! ఆయన కూడా ఎప్పుడూ నాకు చెప్పలేదే?
ప్ర:- శంకరం బుకాయించటం బాగా నేర్చుకున్నావులే! సరే! రాయణిం గారిల్లు అంటుకున్న విషయం తెలుసునా?
ప్ర:- పెట్రోలు వాసనలు గుప్పు మన్న రోజు ,వేయి నాల్కలతో ఉవ్వెత్తున మంటలు లేచి ఆకాశాన్ని అందుకున్న రోజు. అన్యాయంగా ఏమీ తెలీని ఆరేళ్ల పసి బాలను మంటల్లోకి తోసి హత్య చేసిన రోజు! పోనీ,అదయినా జ్ఞాపకముందా?
ప్ర:- ఏమిటీ? శశి బాలను హత్య చేశారా? ఆ అమ్మాయి మంటల్లో కాలి పోలేదా?!
ప్ర:- (నవ్వి) అయితే నీకేం తెలీదన్నమాట! ఒరేయ్ ! ఇది హత్య కేసుతో కూడుకున్న దొంగతనం. అందుకే విషయాలనన్నిటినీ ,నీ అంతట నువ్వుగా చెప్పు.
(పాజ్ )
(శంకరం ఏమీ మాట్లాడ్డు.)
ప్ర:- సరేలే! నువ్వు కాఫీ తీసుకుని స్థిమిత పడ్డాక చెప్పు.
శం:- కాఫీ ఎందుకులే ఇప్పుడు.
ప్ర:- నీకు తెలీదు.నీ మనస్సేం బావులేదు. నువ్వు స్థిమిత పడితే గాని లాభంలేదు.స్థిమితంగా ఆలోచించుకుని మరీ చెప్పు. ఈ పది లక్షల విలువ చేసే హారం నీకెలా వచ్చిందో?
(ప్రకాశం శంకరాన్ని కూచో బెట్టి ,కాఫీ గ్లాసులో పోసిస్తాడు.)
[శంకరం కొద్దిగా కాఫీ తాగి లేచి విరగబడి నవ్వుతాడు.]
ప్ర:- (కంగారుగా) శంకరం ! ఏమైంది నీకు?
(శంకరం మళ్లీ నవ్వుతాడు)
ప్ర:- శంకరం ! నిన్నే!! అనవసరంగా నా కోపాగ్నికి ఆహుతి కాకు.
శం:- (తాపీగా) ఇప్పుడు నాకు కొంచెం కొంచెంగా అర్థమౌతోంది.అయితే, నువ్వు జమీందారు రాయణిం గారి కేసులో డిటెక్టివ్ వన్న మాట! ఆయన హారం లక్ష రూపాయల విలువ చేసేది. నా హారం పదివేల రూపాయల విలువ కూడా చెయ్యనిది. నేనీ హారాన్ని ఎనిమిది వేలకి కొన్నాను. ఈ హారం ఆయనది కాదు.కావాలంటే చూపించుకో వచ్చు.
ప్ర:- అబధ్ధం! ఈ హారం ఆయనదే!! నీ దైతే,ఈ హారం నువ్వెప్పుడు కొన్నావో?ఎందుకు కొన్నావో? ఎలా కొన్నావో చెప్పు.
(శంకరం ముఖ కవళికలు మారిపోతాయి. దూరంగా ఎక్కడో స్త్రీ గొంతు-'నిను వీడని నీడను నేనూ,అనే పాట)
శం:- (ఏడుస్తూ) ప్రకాశం! నన్ను క్షమించు ప్రకాశం! ఆ పాత విషయాలన్నీ మళ్ళీ తవ్వకు.ఆ వజ్రాల హారం విషయం అడిగావంటే నా గుండెలు బ్రద్దలౌతాయి.ఒంటరిగా ఉన్నప్పుడు నాకా హారం జ్ఞప్తికి వస్తే నేను పిచ్చి వాడినైపోతాను. అది నా జీవితానికి సంబంధించిన ఒక విషాద స్మృతి ప్రకాశం! నన్ను క్షమించి మరో విషయం ఏదైనా అడుగు ప్రకాశం! కాని,ఆ హారం విషయం మాత్రం అడక్కు.
ప్ర:- ఒరే! శంకరం! నువ్వు నిముషానికిలా నవ్వటం,నిముషానికి ఏడవటం చూస్తుంటే మరొక డిటెక్టివ్ అయితే తప్పకుండా నిన్ను అనుమానించేవాడే!కాని,నువ్వు నా స్నేహితుడివి!కావలసిన వాడివి! అందుకే అడుగుతున్నాను ఈ హారం నీకెక్కడిది?నిజంగా నీలో ఏదోషమూ లేకుంటే నిన్ను తప్పకుండా వదిలేస్తాను. ఊ(! చెప్పు!!
శం:- ప్రకాశం! చెప్పక తప్పదంటావా?
ప్ర:- ఇదుగో చూడు. నన్ను నీ స్నేహితుడిగా మాత్రం భావించకు. మా శాఖకు మిత్రులూ-శత్రువులూ,బంధువులూ ఉండరు. నిన్ను మరీ మరీ అడుగుతున్నాను. చెప్పు.నీకీ హారం ఎక్కడినించొచ్చిందోను?
శం:- ఆ రోజులు నాజీవితానికి వెలుగు బాటలు.ఆరోజులను తలచుకున్నప్పుడల్లా ఇప్పటికీ నా హృదయం ఆనందంతో పరవ్ళు తొక్కు తుంది. ఇదంతా ఎవరి వల్ల ననుకుంటున్నావ్ ? 'ఆమె ' వల్ల! ఆమె అందానికి మారు పేరు! ఆమె కంఠంలోని మాధుర్యం, ఆమె హృదయంలోని మృదుత్వం,ఆమె కళ్లల్లోని ఆ అమాయకపు చిలిపి చూపులూ - ఎంత మరచిపోదామన్నా మరపుకు రావురా ప్రకాశం! మరపుకు రావు! ఆమె ఎవరనుకుంటున్నావు? రాధ! నా రాధ! అనూ రాధ . . ప్రకాశం!!

ప్ర:-శంకరం అయితే,ఈ అనూరాధ ఎవరూ?ఆమె నీకేమవుతుంది?
శం:- ఏంచెప్పను ప్రకాశం? అనూరాధ స్వయానా నా మేనత్త కూతురు. నీకు తెలుసునుగా ప్రకాశం మాకున్న ఆస్థి పాస్థులేమిటో ,మొదట్నించీను? పాడు పడి పోయిన కొంపా,చిరిగిపోయిన బొంతలూ - ఆరువేల రూపాయల దాకా అప్పులూ! నువ్వే ఆలోచించు అప్పటి పరిస్థితుల్లో నేనీ ప్లీడరీ చదవ గలిగే వాడినే నంటావా? హూ(! . . .
మా అమ్మకూ నాన్నకూ అనూరాధంటే అసలు కిట్టదు.దానికో కారణ ముంది. అనూరాధ తల్లి అంటే మా మేనత్త . . భర్త పోయిన కొద్దినాళ్లకే తన అనూరాధని తీసుకుని ఎవడితోనో లేచిపోయింది. అంతే! వాళ్లకీ మాకూ మధ్య గల
సంబంధాలు తెగిపోయాయి. సంస్కారవంతులూ మానాభిమానాలూ గలిగిన మనుషులు బ్రతికే ప్రపంచం కదురా మరి ఇది!ఆస్తి పాస్తులున్నా లేకపోయినా , ఆత్మాభిమానాలకీ గౌరవాలకీ లోటు లేదుగా మరి! అందుకే,అనూరాధా వాళ్లను మా వాళ్లు వెలేశారు.
నేను విజయవాడ చదువుకని వెళ్లినప్పుడు మొట్టమొదటిగా అనూరాధను కలుసు కున్నాను. అప్పటికామె తల్లి కూడా చనిపోయింది. ఉంది!తట్టెడాస్థి!! ఎందుకు? ఆదరించే పెద్ద దిక్కు లేకపోయినాక?!
కానీ,ప్రకాశం! అనూ నన్ను పూర్తిగా నమ్మింది. మేమిద్దరం ప్రేమించుకున్నాం.అయితే,నేనిక్కడొక తప్పు పని చేశాను.
ప్ర:- ఏమిటది?
శం:- నేను లా చదవడానికి మెడ్రాసు పోతానన్నాను.ఆమె దానికి అంగీకరించలేదు. దూరమై పోతున్నానని బాధ పడింది. నేనామెను అర్థం చేసుకో లేక పోయాను. నిజంగా ప్రకాశం పట్నంలో నా ఖర్చంతా ఎవరు భరించారనుకుంటున్నవు? . . అనూరాధ!
ప్ర:- ఏరా! అయితే నువ్వు అనూరాధను కూడా ఎందుకు తీసికెళ్ల లేదు మెడ్రాసు.ఆమె రానందా?
శం:- దానికో కారణముంది. నా చదువెక్కడ పాడై పోతుందోననీఅమె రాలేదు. ఆ తరవాత నాకివన్నీ ఆమె రాసిన ఆఖరి ఉత్తరం ద్వారా తెలిశాయి. నిజంగా ప్రకాశం మావాళ్లకీ విషయాలన్నీ తెలీకంటావా? తెలుసును. కానీ,వాళ్లూహించారు. అనూరాధ ఎంత అక్కర్లేక పోయినా ,ఆమె ఆస్థంటూ కావాలిగా?! అందుకే,నా చదువు పూర్తయ్యేదాకా నోళ్లు నొక్కుకు కూచున్నారు. ఆ తరవాతే విషం కక్కటం మొదలుపెట్టారు .
నేనా రోజు నా రాధ దగ్గరకు బయల్దేరాను. ఆ రోజే నేనీ హారాన్ని కూడా కొన్నాను. అది కూడా ఆమె పంపిన డబ్బుతోనే! అదైనా ఆమె కోరింది కాబట్టి!! వెధవ పాడు రోజు! కొంచెం ముందైనా బయల్దేరాను కాదు. బయల్దేరుతుండగా ఆ పాడు ఉత్తరం వచ్చి నా చేతిలో పడింది. అంతే! నా ఊహా జ్ఞానమంతా నశించి పోయింది. నా చదువేదీ అక్కడ పని చెయ్య లేక పోయింది.నా హృదయం కోపాగ్ని శిఖల వేడికి పగిలి పోయింది. నా కాలి కింద భూమి బీటలు తీసింది. కోపంతో ఒక ఉత్తరం రాశాను. అదేరా నా ఆఖరి ఉత్తరం - అదే!
ప్ర:- అయితే నీకొచ్చిన ఉత్తరంలో ఏం రాసుంది? అదెవరు రాశారు?
శం:- అది పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టే ఉత్తరం. అప్పుడు నేనూహించలేకపోయాను. అది మా నాన్న వ్రాసిన ఉత్తరం. అనూరాధ ఎవరితోనో తిరుగుతోందనీ,లేచి పోయిన దాని కూతురు అంతకన్నా మంచి పనేంచేస్తుందనీ,ఇంకా ఏవేవో దాన్నిండారాసి పారేశారు.
ప్ర:- అయితే నువ్వా ఉత్తరాన్ని నమ్మావా?
శం:- అంతపనీ చెయ్య బట్టేరా నేనిప్పుడిలా కుమిలి పోతున్నది. పాపం అనూరాధ నాకెన్నో ఉత్తరాలు రాసిందిరా! కనీసం నేను వాటిని చూడనన్నా చూడ లేదు. అవన్నీ చింపి పారేశాన్రా. ఆమె మీద నాకు ఎక్కడలేని కోపం,పగ-ద్వేషం! నేను కొన్న హారాన్ని ఆమెకు పార్సెల్ చేసి, చేతులు దులిపేసుకున్నాను. ఆ తరవాతే నిజం బయట పడింది.నాన్న ఫొటో స్టూడియో వాడి నొకడ్ని పట్టుకుని ,ఎవడో కోన్ కిస్కా గాడి ఫొటోను తెచ్చి ,అనూరాధ ఫొటోతో జోడించి ట్రిక్ ఫొటోగ్రఫీ తో నన్ను మోసం చేశాడని! అప్పటికే ఘోరం జరిగి పోయిందిరా! అనూరాధ చాలా సున్నిత మనస్కురాలు. నా ప్రేమకు దూరమై ఆమె బతక లేననుకుంది. ఆత్మహత్య చేసుకుంది. చచ్చిపోయే ముందు ఈ హారాన్ని నాకు కానుక గా పంపి ,నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి మెళ్లో దీన్ని అలంకరించమందిరా! ఇప్పుడు చెప్పు. ఈ హారాన్ని నా ప్రియురాలి చావు కానుకగా నా భార్య మెళ్లో కట్టి ఆనందించనా?లేక నా వివేక శూన్యతకి చిహ్నంగా దాచుకోనా?!',చెప్పరా! చెప్పు!?
ప్ర:- క్షమించు శంకరం! ఈ హారం వెనుక ఇంతటి విషాద గాధ ఇమిడి వుందన్న విషయం నాకు తెలీదు. నిన్ను అనవసరంగా బాధ పెట్టాను.ప్రస్తుతం ఇప్పుడు నువ్వున్న ఈ పరిస్థితులో ఈ హారం నీదగ్గరుండటం అంత మంచిదికాదు. అందుకే దీన్ని నువ్వు నాకు అమ్మెయ్యి! నేను కొనుక్కుంటాను.
శం:- ప్రకాశం! ఎంత మాటన్నవ్ ప్రకాశం! అంతకన్నా నీ చేతిలో వున్న ఆ రివాల్వరుతో నా గుండెలు చీల్చెయ్ !అంతే గాని,నా అనూరాధను మాత్రం నాకు దూరం చెయ్యకు.
ప్ర:- పిఛ్చివాడా! ఈ హారం నీదని నాకు తెలిసిపోయింది. నువ్వే కనక దొంగతనం చేసి వుంటే, ఈ హారాన్ని నాకు అమ్మడానికి సిధ్ధ పడే వాడివి. ఎందుకంటే , నువ్వీ హారాన్ని బయట ఎక్కడా అమ్మలేవు. ఇదిగో,నీ హారాన్ని నువ్వు తీసుకో.
( ప్రకాశం హారాన్ని ఇవ్వగా శంకరం తీసుకుని తన కోటు జేబులో పెట్టుకుంటాడు.)
ప్ర: ఇప్పుడు చెప్పు.నీ దగ్గర పని చేస్తున్న సుబ్బయ్య ఎటువంటి వాడు?
శం:- ఏదో డబ్బు కక్కుర్తీ పీనాసితనమే గానీ మనిషి చాలా మంచివాడు. దైవ భక్తి పరుడు.భయస్తుడు.ఎవర్నీ బాధపెట్టేరకం కాడు.
ప్ర:- మరి,వెంకన్నా?!
శం:- ఈ మధ్యనే మా పక్కింటి వాళ్ల దగ్గర పనిలో చేరాడు.ఏదో చిల్లర మల్లర డబ్బుల కోసం ఆశ పడతడుగాని దొంగతనాలు చేసే రకం కాడు.
ప్ర:- అప్పుడు రాయణిం గారిల్లు తగల బడుతున్నప్పుడు నీతో పాటు మంటలనార్పేటందుకు మంటల్లోకి ఎవరెవరు దూకారు?
శం:- నేనూ సుబ్బయ్యగారూ!
ప్ర:- ఈ సుబ్బయ్య నీ దగ్గర పనిలో చేరడానికి ముందు ఎవరి దగ్గర పని చేసేవాడు?
శం:- రాయణింగారింట్లో! పాపం రాయణింగారి కూతురు శశిబాల చచ్చిపోయాక ఆ బాధను తట్టుకోలేక అక్కడ ఉద్యఒగం మానేసి నా దగ్గర చేరాడు.
ప్ర:- ఐ సీ! . . (క్షణం ఆలోచించి ఈల వేసి) నేను వేసే ఎర లోంచి ఏ పక్షీ తప్పించుకో లేదు. బీ క్విక్ ! నువ్వు కూడా నాతో వచ్చెయ్యి! ఇక్కడ నువ్వుండటం అంత మంచిది కాదు.
శం:- ఇప్పుడు మనం . . .
ప్ర:- నో క్వశ్చన్స్ ఐ సే! కమాన్ ! లెట్స్ గో!!
(శంకరాన్ని తీసుకుని ప్రకాశం నిష్క్రమించును.)
[క్షణం విరామం. వెంకన్న ఎల్.ఎఫ్.లోంచి ప్రవేశించి గదంతా చిందరవందరగా ఉండటం చూసి ఆశ్చర్య పోతాడు. సీక్రెట్ అల్మారా తెరిచి ఉండటంచూస్తాడు. గదంతా పరిశీలించి గబగబా నిష్క్రమించును]
(విష్కంభం!)


 
 

Trackback address for this post:

authimage

Comments, Trackbacks:

No Comments/Trackbacks for this post yet...

Leave a comment :

Your email address will not be displayed on this site.
Your URL will be displayed.
Allowed XHTML tags: <!, p, ul, ol, li, dl, dt, dd, address, blockquote, ins, del, a, span, bdo, br, em, strong, dfn, code, samp, kdb, var, cite, abbr, acronym, q, sub, sup, tt, i, b, big, small, img>
URLs, email, AIM and ICQs will be converted automatically.
Options:
 
(Line breaks become <br />)
(Set cookies for name, email & url)
Validation code:
Please enter the above code here:
For protection from spambots (case-sensitive).

Footer

The content of this website belongs to a private person, blog.co.uk is not responsible for the content of this website.