Search blog.co.uk

..ఊసర విల్లి-4.

by ramrali @ 2007-08-24 - 21:02:09

 Gun      Gun 
 contd..ఊసర విల్లి-4.
ప్ర:- చెప్పమంటావా ? అయితే విను. నువ్వు మంటల్లోంచి శశి బాలను రక్షించి తీసుకు వస్తున్నావు. ఇనప్పెట్టె తాళం చెవులు ఎక్కడున్నాయో నీకు బాగా తెలుసు. అప్పుడు నీకో ఆలోచన తట్టింది. ఒక్క నిముషంలో ఎప్పట్నుంచో నువ్వు కన్నేస్తూ వచ్చిన ఆ వజ్రాల హారం నీ చేతుల్లో వుంటుంది. ఆలోచన తట్టిందే తడవు .శశి బాల మాటటుంచి ఇనప్పెట్టె తెరిచావు. అందులోని హారాన్ని తీశావు. అంతలో శశిబాల అరిచింది - 'సుబ్బయ్య తాతా! ఆ హారం ఎందుకు తీశావూ',అని. వెంటనే నువు తేరుకున్నావు. ఆ కంగారులో నీకేం చెయ్యాలో పాలు పోలేదు. హారం తియ్యటం ఆ పిల్ల కంట పడ బట్టి ఆ అమ్మాయి నోరు శాశ్వతంగా మూసేశావు. మంటల్లోకి తోసి హత్య చేశావు. అప్పుడు వెనకనించి నేను తీసిన ఫొటోయే ఇది!
సు:- (బాధగా) అవును బాబూ! అనుకోకుండా ఈ చేతులు అన్యాయం చేశాయి. పాపం! ఆ పిల్ల 'తాతా! తాతా!!',అంటూ నా వెనక తిరుగుతుండేది. నా పాపానికి నిష్కౄతి లేదు.ఈ పాపానికి నేను శిక్ష పొందటానికి కూడా సిధ్ధమే ! కాని, చూడు బాబూ! నా మీద ఆధార పడి శశి బాల వంటి చిన్న పిల్ల
బ్రతుకుతోంది. దానికి తల్లీ -తండ్రీ లేరు. అది నా మనుమరాలు. దాన్ని చూసినప్పుడల్లా శశిబాల నా కళ్లల్లో మెదుల్తుంది. నా పాపం నా కళ్లముందుకొస్తుంది. నాకీ శిక్ష చాలు బాబూ! నువ్వు నన్ననవసరంగా పోలీసులకి వప్పగిస్తే, ఆ పిల్ల భవిష్యత్తుకు అన్యాయం చేసిన వాడివౌతావు. కావాలంటే,ఆ పాడు హారం నీకే ఇస్తాను తీసుకుపో బాబూ! తీసుకు పో!!
( సుబ్బయ్య ఆంజనేయస్వామి పటం ఫ్రేం లాగి దాని వెనక దాచిన వజ్రాల హారం తీసిస్తాడు. మొదటి హారానికీ ఈ హారానికీ ఎక్కడా పోలికలుండవు.)
సు:- బాబూ! ఆ ఫొటో ఇలాగిచ్చెయ్యి!
ప్ర:- సుబ్బయ్య తాతా! ఫొటో కావాలా? ఇదిగో! ఇదే! అగ్గిపెట్టె!!
సు:- అయ్య బాబోయ్ ! చత్వారం ముండా వాడ్ని చేసి మోసం చేస్తావా? రామ!రామ!! లక్ష రూపాయల హారాన్ని గెద్దలా వచ్చి తన్నుకు పోతావా?
ప్ర :- (గెడ్డం లాగి హారాన్ని ముద్దు పెట్టుకుని నవ్వి ) సుబ్బయ్య తాతా! నా అన్వేషణ ఈ నాటికి ఫలించింది.
సు:- ఆ! ప్రకాశం బాబూ! మీరా? ఎందుకింత నాటక మాడారు?
శం:- (వీధి గుమ్మంలోచి ప్రవేశించి) ఏం? నువ్వు నాటకమాడలా?
నీ లాటి నమ్మక ద్రోహులని పట్టుకోవడానికి అవతరించిన వాడు నా మిత్రుడు ప్రకాశ్ ! డిటెక్టివ్ ప్రకాష్ !!
సు:- ఆ(!
ప్ర:- (నవ్వి) శంకరం! పప్పులో కాలేశావురా! ఇది నా స్వార్జితంరా! స్వార్జితం!!
శం:- ఏవిట్రా ప్రకాశం నువ్వనేది?
ప్ర:- అవున్రా! నేను ఇంత కష్ట పడి దీన్ని సంపాదించింది పోలీసుల చేతుల్లో వెయ్యటానిక్కాదు. ఇది నేను చాలా చాక చక్యంగా సంపాదించాను. హత్య చేసిన సుబ్బయ్య ఎలాగూ ఈ హారం నా దగ్గరుందని చెప్పలేడు. ఇక నీ మాటంటావా? నీ ప్రేమ గాధంతా నా చేతుల్లో వుంది. నీ ప్రియురాలు అనూరాధ పేరు కోర్టుకెక్కడం నీకూ ఇష్టం లేదనుకుంటాను. బై ది బై మరి నే వస్తా! బై! బై!!
(ఎం.బి. గుమ్మంలోంచి ఫుల్ సూటులో చేతిలో రివాల్వరుతో వెంకన్న ప్రవేశిస్తాడు.)
వెం:- జస్ట్ వైట్ ప్లీజ్ !
ప్ర:- ఎవరూ? (వెనక్కి తిరిగి చూసి రివాల్వరు వదిలి చేతులెత్తును)
వెం:- కాస్త మీరాగాలి.మీరిప్పుడు మాట్లాడినవన్నీ ఈ పక్క గదిలో వుండి టేపు రికార్డ్ చేశాను. మిస్టర్ ఊసరవిల్లీ! ఐ యాం సారీ మిస్టర్ ప్రకాష్ ! చాలాకాలం నించీ ఎవరి పేరు చెబితే పోలీసు డిపార్టుమెంటు గడ గడలాడిపోతోందో - వాణ్ణి నేడు నేను పట్టుకో గలిగాను.
శం:- (ఆశ్చర్యంగా ) వెంకన్నా?!
వెం:- కాదు బాబయ్యా! సి.ఐ.డి. ఆఫీసర్ మిస్టర్ . వెంకటేశ్వర్లు. శంకరంగారూ! ఊసరవిల్లి విషయం మీరు పేపర్లో చదవడమేగాని,అతని గురించి మీకు సరిగ్గా తెలీదనుకుంటాను. ఈ ఊసరవిల్లి అనేక నేరాలు చేశాడు. అయితే,ఇతనిలో ఒక సుగుణముంది. ఇతడ్ని మా శాఖ ఎప్పుడు వెంటాడినా ఒక కొత్త నేరం దొరుకుతుందీ- ఒక కొత్త దొంగ దొరుకుతాడు. దొంగను ముందు పట్టే వాడు ఊసరవిల్లి.ఆ దొంగను మభ్య పెట్టి మోసం చేసి , అతని దగ్గరున్న దొంగ సొమ్ముని దోచుకు పోయేవాడు కూడా ఈ ఊసరవిల్లే!
వెడుతూ - వెడుతూ మాకు ఫోను ద్వారాగానీ ఉత్తరం ద్వారాగానీ తెలియ పర్చేవాడు - 'ఫలానా వ్యక్తి ఫలానా నేరం చేశాడు. అతని దగ్గరున్న దొంగ సొమ్మును నేను దోచుకు పోతున్నాను. ప్రస్తుతం అతను ఫలానా చోట వున్నాడు. మీ రెళ్లి అతణ్ణి పట్టుకోండి. ఇట్లు,ఊసరవిల్లీ,అని.
ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ ప్రకాష్ ! దొంగను పట్టించడంలో నువ్వు ఘటికుడివే కావచ్చు. కాని,చట్టం దృష్టిలో నువ్వు కూడా నేరస్థుడివే! అందుకే నిన్ను అరెస్టు చెయ్యక తప్పదు.
సు:- రామ! రామ!! అయితే నన్నొక దొంగ పట్టుకున్నాడన్నమాట!
ప్ర:- వెంకటేశ్వర్లు గారూ! నన్నైతే మీరు పట్టుకోగలిగారు గానీ,మీ
మీద కర్రెత్తి పట్టి వుంచిన ఆ సుబ్బయ్యను మీరు పట్టు కోగలరా?
(వెంకటేశ్వర్లు వెనక్కి తిరగ్గానే ప్రకాశం కిందపడి వున్న రివాల్వరునందుకుంటాడు.)
ప్ర:- హాండ్స్ అప్ ! మిస్టర్ వెంకటేశ్వర్లూ! నేనింతవరకూ దొంగతనాలే గాని,హత్యలు చెయ్య లేదు. దయచేసి నన్ను హంతకుడిగా మాత్రం మార్చకండి! (పారిపోతున్న సుబ్బయ్యని చూసి ) ఆగు సుబ్బయ్యా! నువ్వు కూడా !! టా! -టా!!
(ప్రకాశం వీధిలోకి పారిపోవును.)
శం:- వెంకటేశ్వర్లుగారూ! ప్రకాశం పారిపోయాడు.
వెం:- ఏం ఫరవా లేదు. బయట మా పోలీసులున్నారు.
[బయట బూట్ల చప్పుళ్లూ,విజిల్సూ,వినిపించి ' హ్యాండ్స్ అప్ !',అని వినిపిస్తుంది.]
సు:- (ఏడుస్తూ) శంకరం బాబూ! నా మనుమరాలు దిక్కు లేనిదై పోయింది. ఆ అమ్మాయిని మీ చేతుల్లో వుంచి పోతున్నను.మీదే బాధ్యత! నే వెళ్లొస్తా బాబూ!!
(తెర)


 
 

Trackback address for this post:

authimage

Comments, Trackbacks: Hide subcomments

Niranjan [Visitor]

2007-08-24 @ 21:16

Sir, what is wrong? Some of your posts only have titles. This drama's previous 3 parts are not posted at all - only titles !!

Leave a comment :

Your email address will not be displayed on this site.
Your URL will be displayed.
Allowed XHTML tags: <!, p, ul, ol, li, dl, dt, dd, address, blockquote, ins, del, a, span, bdo, br, em, strong, dfn, code, samp, kdb, var, cite, abbr, acronym, q, sub, sup, tt, i, b, big, small, img>
URLs, email, AIM and ICQs will be converted automatically.
Options:
 
(Line breaks become <br />)
(Set cookies for name, email & url)
Validation code:
Please enter the above code here:
For protection from spambots (case-sensitive).

Footer

The content of this website belongs to a private person, blog.co.uk is not responsible for the content of this website.