నీ మంత్ర జపం నా వల్ల కాదు!!
నూటెనిమిది మార్లు నీ మంత్రం జపించాలట!?
పొరబాటున నీ మంత్రం చదివే టప్పుడు,
నూటెనిమిది మార్లు దాటి ఏ ఒక్క టెక్కువైనా
అదే!. . మేరు పూస దాటిందంటే . . .
మరో మారు . . ప్రాయశ్చిత్తం చేసుకుని . . .
మరో నూటెనిమిది మార్లు జపించాలట!
అదే మంత్రాన్ని . . . ! శ్రద్ధగా !?!
అసలు నీ నామస్మరణ నే మానిందెప్పుడయ్యా?!
లెక్కలతో వచ్చిన చిక్కులివి!
డొక్క సుద్ధిలేని నాకా లెక్కలు పడవు?!
లెక్కల మధ్య నిన్నిరికించి నే కొలవలేను!
లెక్క ప్రకారం నీ మంత్ర జపం చేసి నేనాపలేకున్నాను
ఇదెక్కడితంటా?! నిద్దట్లో నిన్ను స్మరించ లేకున్నానని
ఓ మూల నా మనసేడుస్తోందే?! నాయనా!తండ్రీ!
నిద్దట్లోకూడా నిన్ను స్మరించే
శక్తిని నాకు ప్రసాదించు!నా కోరిక మన్నించు!!
నీవు అనంతుడివి కాదా?! ఓ అనంతా!!
నేను చేసే నీ నామ జపం
అనంతమూ-నిత్యమూ-అను క్షణమూ ....
అవ్వాలనికోరుతున్నానయ్యా!!













No Comments/Trackbacks for this post yet...