సమైక్యతా రాగం ఆలపిద్దాం!!
మనమందరం ఏ కారణం చేతనైతేనేం ?!
తల్లి కడుపునే జన్మిస్తాం!
ఆకలికి ఒకే విధంగా స్పందిస్తాం
విత్తు దశనించి మొక్క దశ కొస్తాం
అప్పుడు . . యింకా మనం వృక్షంగా మారక ముందే . .
పరిసరాలూ వాతావరణం . . తమ వంతు ప్రభవాన్ని
మనపై చూపిస్తాయి!పెద్దల మాటలను మనం
గౌరవిస్తాం?. . లేదు . . మనం నమ్ముతాం . . మూఢంగా . . !
అప్పుడే మొదలౌతుంది మన పతనానికి నాంది!
మన కన్నా ముందే పుట్టిన మన పూర్వీకులు
కులం . . మతం . . . అనే అడ్డుగోడల్ని పెట్టుకునారు
వాళ్లల్లో వాళ్లు కొట్లాడుకుంటున్నారు
ఎవరికివారే . . తామేదో గొప్పవారమనే అహంలో
బతుకుతున్నారు.పాపం! . . వాళ్లు పిచ్చివాళ్లు . . .
మన పెరుగుదలనరికట్టే కలుపు మొక్కల్ని తియ్యరు.
మన పూర్వుల్లాగే మనం మన పెరుగుదల నరికట్టే
కలుపు మొక్కలపై యుద్ధం చెయ్యం
మనలాగే పెరుగుతున్న ఇతర మానవ మొక్కలే
మన ప్రగతినరికడుతున్నయని భ్రమిస్తాం!
నేను . . నాది . . . నా కుటుంబం,అంటూ;
నేనే సర్వస్వం కావాలని . .
తోటి మానవ మొక్కలపైకి
మరిన్నికలుపు మొక్కల్ని పెంచి ఉసి కొల్పుతాం
ఇంకా అర్థం చేసుకోరేం?! . .
మనిషి ఈ లోకంలో బ్రతికేది అరక్షణం . .
ఆ తరవా అందరం మట్టిలోనే కలిసి పోతాం!!
అందుకే బ్రతికినంత కాలం . . .
తోటి మనిషితో మనకెందుకు పేచీ?!
వాళ్లనీ మనలాగే బ్రతకనిద్దాం!
వసుథైక కుటుంబాన్ని నెలకొల్పుదాం!!













No Comments/Trackbacks for this post yet...