Search blog.co.uk

చిన్న కోరిక!-kavitha-5

by ramrali @ 2007-07-29 - 11:05:55

చిన్న కోరిక!

కోరను దేవా! . . నిన్నేదియు కోరను!!
కోరక ముందే . . . .
నా అవసరాలను దీర్చే నిన్నేమి కోరను?!
నే పొందే సుఖ-దు:ఖాలన్నీ నా మంచిని కోరి
నీవే ఇస్తున్నప్పుడు . . నే నింకేమి కోరేది??
కోరక తప్పదందువా? అయితే;కోరెద!!
'సర్వే జనా సుఖినో భవంతు ' అని,
'తమసోమా జ్యోతిర్గమయ 'అని,
'మృత్యోర్మా అమృతంగమయ ' అని;
ఇలా కో రే మా ఆర్యుల కోరికలను
యదార్థం చేయమని కోరెద!!
నీ పై నా భక్తి ప్రపత్తులని ఇంకా . . .
బల పడేలా చేయమని కోరెద! ఇంకా. . . !
నా ఇంట నిత్యాన్న దానం జరిగేలాగున,
అను నిత్యం . . . నా ఇంటి నించి . . . ;
ధన-ధాన్యాదులు బీదా-బిక్కికి అందేలాగున ,
సర్వ వ్యాధి నివృత్యర్థం . . . జరా మృత్యు నివారణార్థం
వ్యాధి గ్రస్తులకూ యితర ఆర్తులకూ . . ,
నా ఇంటినించి అమృతం
ప్రవహించుకుంటూపోయి అందే లాగున-
ఓ చిన్న వరం ప్రసాదించమని కోరెద!!


 
 

Trackback address for this post:

authimage

Comments, Trackbacks:

No Comments/Trackbacks for this post yet...

Leave a comment :

Your email address will not be displayed on this site.
Your URL will be displayed.
Allowed XHTML tags: <!, p, ul, ol, li, dl, dt, dd, address, blockquote, ins, del, a, span, bdo, br, em, strong, dfn, code, samp, kdb, var, cite, abbr, acronym, q, sub, sup, tt, i, b, big, small, img>
URLs, email, AIM and ICQs will be converted automatically.
Options:
 
(Line breaks become <br />)
(Set cookies for name, email & url)
Validation code:
Please enter the above code here:
For protection from spambots (case-sensitive).

Footer

The content of this website belongs to a private person, blog.co.uk is not responsible for the content of this website.