Search blog.co.uk

అంతర్ మథనం -kavitha-3

by ramrali @ 2007-07-29 - 08:34:06

శ్రీ సాగి శివ సీతా రామ రాజు స్మారక కళాపీఠం-విజయనగరం వారు జిల్లా స్థాయిలో నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ పురస్కారాన్ని అందుకున్న కవిత!

అంతర్ మథనం
ఓకవి! . .
మస్తిష్కాన్ని మథించాడు
'విషం', పుట్టింది!
దాన్ని కాగితం మీదొలికించాడు
ఆ గరళం మింగిన జనం కొట్టుకు చచ్చారు
కుల, మత,భాషా ద్వేషాలని రగిలించే గరళమది!
ఓ కవి! . .
మస్తిష్కాన్ని మథించాడు
'శ్రీ' లక్ష్మి పుట్టింది!
"శ్రీ'పొందుతో గిలగిల్లాడి చచ్చాడా కవి?
మఖలో పుట్టి పుబ్బలో మాడాయతని కవితలు!
ఓ కవి! . .
మస్తిష్కాన్ని మథించాడు!
'బురద ' ,పుట్టింది!
బురద లో జనం కూరుకు పోయారు
వావి వరసలొదిలి పతితులయ్యారు!
ఓ కవి . . !
మస్తిష్కాన్ని మథించాడు!
'అమృతం', పొంగింది!!
పీయూష పానం తో జనులమరులయ్యారు!
కవితలతనివి చిరస్మరణీయాలయ్యాయి!!
నేడు -
'గరళం', తాగే గరళ కంఠుడు లేడు!
'శ్రీ',ని చేకొందుకు శ్రీ పతి రాడు!!
'బురద ',ను పన్నీరు గావించే
ఆదివరాహంపుట్టదు!!!
అందుకే -
'అమృతం పొంగే దాకా నా అంతర్మథనం!?'
ఓ కవీ! . .
నీ అంతర్మథనం లో ఏం పుడుతుందో ఎవరికెరూ?
కవి వైతే 'కవి ',గా వుండు! 'కపి ',గా మారకు!!
'పీయూషం' పుట్టేదాకా అంతర్మథనం కొన సాగించు!
ఆ పై ; కాగితం పై అక్షరాలను విదిలించు!!!



Ist Class Kavita. Chala Chala bagundi

Posted by: Mr. Tyaga Raju Atreyapurapu  At: 24, Jan 2007 10:12:35 PM IST

Dr. muralimohan rao gariki,
Namaskaramulu.
mee Antharmathanam chala bagundi..
naa Mounam pai mee vishleshana chala bagundi..
nenemi pedda kavini ganu kani, mee prothsaham naku entho utthejanichindi..
Dhanyavadamulu..

Posted by: Mr. pujraj  At: 17, Jan 2007 12:52:50 PM IST


 
 

Trackback address for this post:

authimage

Comments, Trackbacks:

No Comments/Trackbacks for this post yet...

Leave a comment :

Your email address will not be displayed on this site.
Your URL will be displayed.
Allowed XHTML tags: <!, p, ul, ol, li, dl, dt, dd, address, blockquote, ins, del, a, span, bdo, br, em, strong, dfn, code, samp, kdb, var, cite, abbr, acronym, q, sub, sup, tt, i, b, big, small, img>
URLs, email, AIM and ICQs will be converted automatically.
Options:
 
(Line breaks become <br />)
(Set cookies for name, email & url)
Validation code:
Please enter the above code here:
For protection from spambots (case-sensitive).

Footer

The content of this website belongs to a private person, blog.co.uk is not responsible for the content of this website.