by ramrali
@ 2007-07-28 - 18:01:52
ఉక్కా ఊంగల భాష!
నేను ఉయ్యాలలో నున్నప్పటి
ఉక్కా ఊంగల భాష నా తల్లి కర్థమైంది!
ఎవరికర్థమైనా కాకున్నా?!
ఆ తల్లి నన్ను ముద్దు మురిపాల తేల్చింది
నేనక్షరాశ్యుడనైనా . . చదువుకున్నా . . .
ఇంకా నేను మాట్లాడేదీ రాసేదీ ఉక్కా . . ఊంగల భాషే!
ఎంత చదివినా? . . ఎన్ని చేసినా . . . ?!
ఇంకా మన మందరం . . జగన్మాత పొత్తిళ్లలో . . .
పాపలమే! పసి పాపలమే!!
మన ఉక్కా-ఊంగల భాష
ఆ జగన్మాత కర్థమైతే . . . ,
అదే పది వేలు!! మాతా!!
జగన్మాతా!!! ఉక్కా . . ఊంగా!!!!













No Comments/Trackbacks for this post yet...